Ganesh Immersion 2023: వినాయక నిమజ్జనానికి 35 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు..

వినాయక నిమజ్జనానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భద్రతపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలో కలిపి మొత్తం 35 వేల మంది పోలీసుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు మొత్తం 21 కి.మీ మేర శోభాయాత్ర నిర్వహించనున్నారు. శోభాయాత్ర జరిగే ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీ సహా అన్ని ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

శోభాయాత్రను పూర్తిగా సీసీటీవీ కెమెరాలో నిఘా నీడలోకి తీసుకొచ్చారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. వైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,బార్లు, కల్లు దుకాణాలు, స్టార్ హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. శోభాయాత్ర, నిమజ్జనాలను బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కమాండ్ అండ్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా పరిశీలించే విధంగా చేశారు. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంగళవారం బందోబస్తును పరిశీలించారు.

Arrangements were made for Vinayaka immersion with 35 thousand people

బాలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్ వరకు శోభాయాత్ర రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను పరిశీలించారు. అడిషనల్ సీపీ సుధీర్ బాబు, జాయింట్ సీపీలు, డీసీపీలతో కలిసి బస్సులో వెళ్లారు. శాలిబండ నుంచి మదీనా వరకు పోలీస్ సిబ్బందితో కలిసి కాలినడకన రూటు​ను పరిశీలించారు. చార్మినార్, మొజంజాహి మార్కెట్, అబిడ్స్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఎలా ఉందో తనిఖీ చేశారు. 25 వేల 694 మంది రాష్ట్ర పోలీసులతో పాటు 125 ప్లాటూన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంట్రల్ ఫోర్స్ సెక్యూరిటీగా ఉండనున్నారు.

శోభాయాత్ర జరిగే రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పార్టీ పోలీసులను మోహరించనున్నారు. చార్మినార్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మక్కా మసీదు సహా ఓల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. శోభాయాత్ర, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 5 డ్రోన్లను ఉపయోగించనున్నారు. డ్రోన్ ద్వారా కమాండ్ కంట్రోల్​ సెంటర్​లోని మెగా స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిశీలిస్తారు.

ఎలాంటి ఘటనలు జరిగినా స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే పోలీసులకు సమాచారం అందిస్తారు. హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్, ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేశారు. మహిళలకు ఇబ్బంది ఎదురుకాకుండా షీ టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టారు. శోభాయాత్ర పొడవునా రోప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ, టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్, ట్రాఫిక్ పోలీసులు, స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్, ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఉండనున్నారు. అటు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం గురువారం జరగనుంది. ఇటు నెక్లెస్ రోడ్డ లో నిమజ్జనాలు కొనసాగుతోన్నాయి. నిమజ్జనాలకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి భారీగా గణనాథులు తరలివచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+