హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసిఫాబాద్ హత్యాచార బాధిరాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం

|
Google Oneindia TeluguNews

అసిఫాబాద్: కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన మహిళ సమత భర్తకు తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. రెవెన్యూ శాఖలో అటెండర్‌గా అతడికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతు గురువారం సమత భర్తకు అందజేశారు. ఈ ఘటన స్వయంగా పర్యవేక్షిస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. బాధిరాలి భర్తకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇప్పించారు.

Asifabad rape victim husband gets govt job.

ఎమ్మెల్యే రేఖా నాయక్ తోపాటు జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి హత్యకు గురైన ఎల్లాపటార్‌ ప్రాంతాన్ని సందర్శించారు. నవంబర్ 24న ముగ్గురు నిందితులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ ఘటనపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను
వెంటనే ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు.

గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను అపహరించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. మరుసటి రోజు ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేపింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన మూడు రోజులకు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులైన ఎల్లాపటార్ గ్రామానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ ముఖ్దుంలను వెంటనే ఉరిశిక్ష వేయాలని లేదంటే ఎన్‌కౌంటర్ చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

English summary
Asifabad rape victim husband gets govt job.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X