Pawan Kalyan: పవన్ కల్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ ఇంటిపై దాడి..
హీరో పవన్ కల్యాణ్ వ్యక్తిగత సెక్యూరిటీగా పని చేసే వ్యక్తి ఇంటిపై దాడి జరిగింది. హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో పవన్ కల్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ వెంకట్ నివాసం ఉంటున్నాడు. వెంకట్ కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం వెంకట్ ఇంటిపై పలువురు దుండగులు దాడి చేశారు.
వెంకట్ ఇంటిపై రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. వెంకట్ ఇంట్లో ఉండే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. దాడి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీలో ఎన్నికల ముగిసిన తర్వాత పలు దాడులు జరిగాయి. ఇది కూడా రాజకీయంగా చేసిన దాడి అని మొదట్లో భావించారు. కానీ పాత కక్షలతో ఈ దాడి జరిగినట్లు గుర్తించారు.

రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి దాడి చేసినట్లు గుర్తించారు. రాజు వెంకట్ ఇంటి ముందు ఉన్న బైక్ ను తగలబట్టాడు.అనంతరం ఇంటిపై రాళ్లతో దాడి చేశాడు. వెంకట్ పై దాడి యత్నిస్తుండగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ దాడిలో పలువురు యువకులు పాల్గొన్నారు. వెంకట్ తన భార్య సరితతో కలిసి ఐదు సంవత్సరాలుగా ఇద్దరు పిల్లలతో కలిసి లెనిన్ నగర్ లో ఉంటున్నాడు.
ఇంటి ఎదురుగా ఉండే రాజు మే 15న రాత్రి వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో వెంకట్ భార్య సరిత రాజును కొట్టింది. దీంతో రాజు బంధువులు వెంకట్ ఇంటిపై కర్రలు, ఇటుకలు, ఇనుప రోడ్లతో దాడి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications