అయ్యాయ్యో వద్దమ్మ శరత్‌పై దాడి: రక్తం కారేలా కొట్టిన కొందరు, ఎందుకంటే

అయ్యయ్యో వద్దమ్మా.. ఓ టీ పౌడర్ యాడ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ నోటా నానింది. అందుకు కారణం ఓ కుర్రాడు శరత్.. ఓ బరాత్‌లో డాన్స్ చేసి హైప్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత మిగతా చోట్ల.. జనం ఫాలొ అయ్యారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో శరత్ సూపర్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే అతనిపై అతడిపై దాడి జరిగింది. అవును రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. కొంతమంది అతడిని విచక్షణారహితంగా కొట్టారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

శరత్‌పై దాడి

శరత్‌పై దాడి

ఏదో ఈవెంట్‌లో గొడవ జరిగి అతడిని కొట్టినట్లు తెలుస్తోంది. శరత్ గాయాలతో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హైదరాబాద్ నల్లగుట్టకు చెందిన శరత్.. సుభీభవ అంటూ కొత్త ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో కొన్నిరోజులుగా 'సుఖీభవ' అనే వీడియో ఒకటి విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఓ టీ పౌడర్‌ యాడ్‌ను రీ-క్రియేట్‌ చేసి తీన్మార్‌ స్టెప్పులేయడం, అది కాస్త మీమ్స్‌ పేజీల ద్వారా ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడం తెలిసిందే. 'అయ్యయ్యో వద్దమ్మా... సుఖీభవ..' ఈ లైన్స్ వాడి మీమ్స్, ట్రోల్స్.. ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని యాడ్స్, సాంగ్స్ ఇలానే ట్రెండ్ అవుతున్నాయి.

డ్యాన్స్ చేసి ఫేమ్

డ్యాన్స్ చేసి ఫేమ్

హైదరాబాద్‌కు చెందిన శరత్.. ఓ రోజు పెళ్లి డ్యాన్స్‌లో భాగంగా డ్యాన్స్ వేస్తూ సరదాగా.. 'అయ్యయ్యో వద్దమ్మా.. ఆ పక్కనే టీ కొట్టు ఉంది. అందరికీ ఓ కప్పు టీ ఇద్దామనుకున్నా.. సుఖీభవ.. సుఖీభవ..' అంటూ పాట పాడి తీన్మార్ స్టెప్పు లేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వైరల్ అవడమే కాదు.. రాత్రికి రాత్రే శరత్ సెలబ్రిటీ కూడా అయిపోయాడు. ఓవర్ నైట్ లో యూట్యూబ్ స్టార్‌ అయ్యాడు.

ఖాకీల వంతు

ఖాకీల వంతు


మరోవైపు హైదరాబాద్ పోలీసుల కూడా అలా చేశారు. వారు జనాలకు అవగాహన కల్పించేందుకు అయ్యాయ్యో వద్దమ్మా అంటున్నారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో చెప్పి.. అయ్యాయ్యో వద్దమ్మా అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతోనైనా జనానికి అవగాహన వస్తుందని భావిస్తున్నారు. బ‌హుమ‌తి గెలుచుకున్నారు.. అభినంద‌న‌లు.. అవార్డును పొంద‌డానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. అంటూ వ‌చ్చే మెసేజ్‌ల‌ను న‌మ్మ‌కండి అంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పుడూ సజెస్ట్ చేస్తారు. కానీ వాటికి అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా.. అనేసేయండి.. అంటూ హైద‌రాబాద్ సిటీ, సైబ‌ర్ క్రైమ్ పోలీసులు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు. వారు ఫ‌న్నీగా ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు కూడా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో అయ్యాయ్యో వద్దమ్మ అనే పదం జనాలకు మంచిగానే వెళుతుంది.

ఇలా వెలుగులోకి

ఇలా వెలుగులోకి

ఓ టీ పౌడ‌ర్ కంపెనీ.. కొన్ని రోజుల కింద ఓ యాడ్‌ చేసింది. ఆ యాడ్‌లో ఓ ట్రాన్స్‌జెండ‌ర్‌.. ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద ఆగి ఉన్న ఓ కారు ద‌గ్గ‌రికి వెళ్లి డోర్ కొడుతుంది. ఆ ట్రాన్స్‌జెండ‌ర్‌ను చూసి కారులో కూర్చున్న‌పెద్దావిడ‌.. విసిగించ‌డానికి వ‌స్తారు ఎక్క‌డి నుంచో అని కారు గ్లాస్ తీసి 10 రూపాయ‌లు ఇవ్వ‌బోతుంది. అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా.. ఈ ప‌క్క‌నే నా టీకొట్టు ఉంద‌మ్మా.. అంద‌రికీ ఓ క‌ప్పు టీ ఇద్దామ‌నుకున్నాను. అని చెప్పి టీ తెచ్చి ఇస్తుంది. ఆ టీ పెద్దావిడ‌కు న‌చ్చ‌డంతో ఇలా రా ఒక‌సారి అని పిలిచి డ‌బ్బులు ఇవ్వ‌బోతుంది. అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా ఈరోజు డ‌బ్బులు తీసుకోను అంటుంది. డ‌బ్బులు ఇవ్వ‌డం లేదు కానీ.. సుఖీభ‌వ‌.. అంటుంది పెద్దావిడ‌. మ‌మ‌కార‌పు మాధుర్యం.. అంటూ ఆ యాడ్ ముగుస్తుంది. ఆ తర్వాత శరత్ చేసిన డ్యాన్స్.. వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిటీ పోలీసులు వంతు వచ్చింది. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని వారు సజెస్ట్ చేస్తున్నారు. ఒకవిధంగా ఇదీ మంచిదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+