హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలాపూర్ ఏఎస్సైకి కరోనా పాజిటివ్, గాంధీలో చేరిక, 30 మంది సిబ్బందికి పరీక్షలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నిర్మూలన కోసం అహోరాత్రులు పనిచేస్తున్న పోలీసులకు కూడా సోకుతోంది. ముంబైలో ఈ సంఖ్య ఎక్కువగా ఉండగా.. తెలంగాణలో కూడా పోలీసులకు వైరస్ వ్యాపిస్తోంది. ఏడుగురు పోలీసులు వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. అయితే బుధవారం రాత్రి దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ మృతిచెందడం ఆందోళన కలిగించింది. పోలీసుశాఖలో ఇది తొలి కరోనా మరణంగా నమోదైంది. అయితే మరో ఏఎస్సై సుధీర్ కృష్ణకు కరోనా వైరస్ వచ్చింది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.

కరోనా కాటు: వైరస్ సోకి కానిస్టేబుల్ మృతి, డిపార్ట్‌మెంట్‌లో తొలి మరణం, డీజీపీ సంతాపం..కరోనా కాటు: వైరస్ సోకి కానిస్టేబుల్ మృతి, డిపార్ట్‌మెంట్‌లో తొలి మరణం, డీజీపీ సంతాపం..

కరోనా నిర్మూలన కోసం పీఎస్ పరిధిలో ఏఎస్సై డ్యూటీ చేస్తున్నాడు. అయితే రెండు, మూడురోజుల నుంచి అతను జ్వరం, జలుబు, దగ్గు వస్తోంది. దీంతో బాలాపూర్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. వారి సిఫారసు మేరకు ఫీవర్ ఆస్పత్రికి తరలించగా.. ఇక్కడ కరోనా వైరస్ పరీక్ష చేశారు. కరోనా వైరస్ టెస్ట్ చేయగా అతనికి పాజిటివ్ వచ్చింది. అతనిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ దవాఖాన పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

balapur asi infect coronavirus positive..

Recommended Video

Rahul Gandhi Request To PM Modi

సుధీర్ కృష్ణతో కలిసి పనిచేస్తున్న మరో 30 మంది సిబ్బంది రక్త నమూనాలను సేకరిస్తున్నారు. వారి రిపోర్ట్ ఆధారంగా క్వారంటైన్ తరలించే అవకాశం ఉంది. దీంతోపాటు బాలాపూర్ వైద్య సిబ్బందికి కూడా పరీక్షలు చేస్తామని వైద్యులు తెలిపారు. అతనికి వైరస్ సోకిన వెంటనే.. అక్కడికి వెళ్లడంతో టెస్టులు నిర్వహించడం అనివార్యమైంది.

English summary
balapur asi sudhir krishna infect coronavirus positive. he joined gandhi hospital for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X