Balapur Ganesh: అయోధ్య రామమందిర ఆకారంలో బాలాపూర్ గణేషుడి మండపం..

తెలంగాణలో వినాయక చవితిని ఘనంగా జరుపుకోంటున్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు గణేషుడి విగ్రహాలు కొలువుదీరాయి. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణనాథుడిని చూసేందుకు భక్తులు తరలొస్తున్నారు. ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు శ్రీసప్తముఖ గణేషుడిగా దర్శనమివ్వనున్నారు. హైదరాబాద్ లో గల్లీ గల్లీలో వినాయకుడి పాటలు వినిపిస్తున్నాయి. వినాయక మండపాలను రకరకాల ఆకారాల్లో రూపొందించారు. ఈ ఏడాది బాలాపూర్ గణేషుడి మండపం అయోధ్య రామ మందిరం తరహాలో ఏర్పాటు చేశారు.

ప్రతి సంవత్సరం నిర్వాహకులు బాలాపూర్ గణేష్ కోసం ఒక ప్రత్యేకమైన థీమ్ తో మండపం ఏర్పాటు చేశారు. గత సంవత్సరం విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయం, అంతకుముందు యాదాద్రి దేవాలయం ఆకారంలో మండపం ఏర్పాటు చేశారు. ఈసారి భక్తులకు అపూర్వమైన, ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా అయోధ్య రామమందిర థీమ్‌ను ఎంచుకున్నామని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి చెప్పారు.

Balapur Ganesha Mandapam was arranged in the shape of Ayodhya Ram temple this time

గతేడాది మాదిరిగానే 15 అడుగుల బాలాపూర్ గణేష్ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. అయితే, ఈసారి దేవతలు, అసురులతో కూడిన 'క్షీర సాగర మధనం' కథనంతో విగ్రహాన్ని అలంకరించినట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా బాలాపూర్ ఉత్సవ్ సమితికి తాపేశ్వరం హనీ ఫుడ్స్ వారు లడ్డూను అందజేయనున్నారు. బాలాపూర్ స్థానికులు సూచించే 21 కేజీల 'బంగారు లడ్డూ' గతేడాది నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది.

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం 1994 నుంచి వేలం వేస్తున్నారు. మొట్టమొదటగా రైతు కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకు వేలం వేశారు. మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు, స్థానికులకు లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేసిన తర్వాత, తన పొలంలో చల్లారు. అప్పటి నుంచి లడ్డూ వేలం కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+