video:తెలంగాణ రాష్ట్రం సంప్రోక్షణ చేయాలి, ప్రక్షాళన కావాలె: బండి సంజయ్
ఎమ్మెల్యేలతో బేరసారాల ఇష్యూ పీక్‌కి చేరింది. ఆ ఇష్యూతో తమకు సంబంధం లేదని బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీ నరసింహుడిపై ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కేటీఆర్ కౌంటర్ అటాక్ చేశారు. గుజరాత్ గులాముల చెప్పులు మోసి.. అదే చేతితో దేవుడిని తాకడం ఆపచారం అన్నారు. వెంటనే ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని కోరారు. ఆ కామెంట్లపై బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తప్పు చేయలే.. అందుకే..
ఎవరైనా
తప్పు
చేస్తే
వెళ్లరని
బండి
సంజయ్
అన్నారు.
కానీ
తాను
గుడిలోకి
అలా
వెళ్లానని
చెప్పారు.
తనలో
నిజాయితీ
ఉందని
వివరించారు.
మంత్రి
కేటీఆర్
మీద
విమర్శలు
చేశారు.
అతను
నాస్తికుడు
అని..
దేవుడిని
విశ్వసించరని
తెలిపారు.
మరీ
దేవుడి
గురించి
మాట్లాడే
అర్హత
ఉందా
అని
అడిగారు.
సంప్రోక్షణ
చేయాల్సింది
గుడిని
కాదని..
తెలంగాణ
రాష్ట్రాన్ని
అని
తెలియజేశారు.
తెలంగాణ మొత్తం సంప్రోక్షణ
ఇచ్చిన
హామీలు
ఏమయ్యాయని
అడిగారు.
ప్రజలను
వంచనకు
గురిచేశారని
తెలిపారు.
మోసం
చేసినందున
తెలంగాణ
రాష్ట్రాన్ని
సంప్రోక్షణ
చేయాలని
కోరారు.
తెలంగాణ
గడ్డ
పవిత్రమైనదని
తెలిపారు.
మీరు
ఒకటి
మాట్లాడితే
తాను
వంద
మాట్లాడుతానని
బండి
సంజయ్
అన్నారు.
మీ
నాన్న
ఎందుకు
బయటకు
రావడం
లేదని
అన్నారు.
షా చెప్పులు మోసి
ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సమయంలో అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్.. ఆ దేవుడిని తాకడం ఏంటీ అన్నారు. దీంతో లక్ష్మీనరసింహా స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సంప్రోక్షణ చేయాలని వేద పండితులను కోరారు. ఆ దేవుడిని కూడా అపవిత్రం చేశారని మండిపడ్డారు. పాప ప్రక్షాళన చేయాలని కేటీఆర్ అన్నారు. ఆ కామెంట్ల మేరకు బండి సంజయ్ నిప్పులు చెరిగారు.