చిరంజీవిని కలిసిన బండి సంజయ్: అభిమానినంటూ అప్యాయంగా.!

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం హైదరాబాద్‌ నగరంలోని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి విచ్చేశారు. చిరంజీవికి పుష్ఫం గుచ్ఛం ఇవ్వగా.. బండి సంజయ్‌కి శాలువా కప్పి సత్కరించారు మెగాస్టార్. చిరంజీవితో సమావేశమైన బండి సంజయ్ పలు అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంపై బండి సంజయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఎప్పుడూ సంతోషదాయకమే. చిరంజీవి వినయశీలి, నా శ్రేయోభిలాషి. నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలకు అభిమానిని అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా వ్యాఖ్యానించారు.

Bandi Sanjay meets megastar Chiranjeevi

చిరంజీవితో భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే కేంద్రం నుంచి పద్మ విభూషణ్ అందుకున్న విషయం తెలిసిందే. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి... ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు.

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు చిరంజీవి. అయితే, ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. మరోవైపు, ఆయన సోదరుడు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేశారు. తాజాగా, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పార్టీతోపాటు కూటమికి చిరంజీవి మద్దతు తెలపడం గమనార్హం.

అంతేగాక, ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిశారు. మోడీ కూడా చిరంజీవి, పవన్ చేతులు పట్టుకుని వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో చిరంజీవి బీజేపీకి దగ్గరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, చిరంజీవికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+