తెలంగాణలో పులి వేట ప్రారంభమైంది: ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందంటూ బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణలో వేట మొదలైందని.. వెటాడడానికే పులి వచ్చిందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాకపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తెలంగాణ గ్రోహిగా మారాడని.. ప్రజా సమస్యలపై గళమెత్తితే తనను పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారని మండిపడ్డారు.

తనను పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. తనను కొత్తకోట, ప్రజ్ఞాపూర్, భువనగిరి తీసుకుపోయే సమయంలో 8 గంటలు రోడ్లపై తిప్పారన్నారు. ఈ క్రమంలో కరీంనగర్ దాటిన తర్వాత ఢిల్లీ నుంచి ఫోన్ చేశారని తన భార్య తెలిపిందన్నారు. తన వద్దకు ఓ కానిస్టేబుల్ వచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదంటూ.. భయపడుతున్నామని చెప్పారని బండి సంజయ్ తెలిపారు. మీరేం భయపడకండి.. ఢిల్లీ నుంచి పులి వస్తోంది.. వేటాడటం మొదలైందని చెబుతూ.. కార్యకర్తలను కాపాడే టైగర్ చేవెళ్ల గడ్డకు వచ్చిందన్నారు.

 Bandi Sanjay slams kcr govt in chevella public meeting.

తెలంగాణ ప్రజలకు అండగా ఉండేందుకు పులి వేట ప్రారంభించిందని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాడని విరుచుకుపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికే అమిత్ షా రాష్ట్రానికి వచ్చారని అన్నారు. తెలంగాణ బీజేపీ ప్రభుత్వం ఏర్ప డిన వెంటనే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. ఒకటో తేదీనే జీతాలిస్తామన్నారు బండి సంజయ్.

డైవర్ట్ దోపిడీనే..: కేసీఆర్ సర్కారుపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఈ సభలో మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారును బొందపెట్టే పార్టీ బీజేపీనేనని అన్నారు. వ్యాపారాలు చేసుకునే తనను రాజకీయాల్లోకి పిలిచింది కేసీఆరేనని చెప్పారు. కేసీఆర్‌వి అన్నీ డైవర్ట్ దోపిడీనేనని విమర్శించారు. కేంద్రం నిధులన్నీ దోచేశారని.. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఫసల్ బీమా పథకం తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

భూసేకరణ పూర్తి కాకపోవడం వల్లే చేవెళ్ల హైవే పూర్తి కాలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. రైతులకు ఫర్టిలైజేషన్ సబ్సిడీ ఏమైందన్నారు. చేవెళ్లలో ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని విమర్శించారు. తెలంగాణలో పంట నష్ట పరిహారం ఏదని ప్రశ్నించిన ఆయన.. రైతులకు సబ్సిడీ ఎందుకివ్వలేదని నిలదీశారు. బీజేపీ మిషన్ తెలంగాణ సక్సెస్ అవుతుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+