మల్కాజిగిరిలో ఒకరికి కరోనా, కుటుంబసభ్యులు సహా అద్దెకుంటున్న వారు హొం క్వారంటైన్..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం నాటికి రాష్ట్రంలో మొత్తం 2698 కరోనా వైరస్ కేసులు నమోదై ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 199 పాజిటివ్ కేసులు రికార్డవగా.. ఇవాళం మల్కాజిగిరిలో కటింగ్ చేసే వ్యక్తి వైరస్ సోకింది దీంతో అతని ఫ్యామిలీ, ఇంట్లో ఉంటోన్న వారు.. సెలూన్‌లో పనిచేసే సిబ్బంది, కటింగ్, షేవింగ్ చేసుకున్న వినియోగదారులు ఐదుగురిని పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మల్లిఖార్జున నగర్‌లో నవీన్ (పేరు మార్చాం) ఉంటున్నారు. సెలూన్ తీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అతను ఓపెన్ చేసి.. రోజూ వెళ్తున్నాడు. అయితే మూడురోజుల నుంచి అతను దగ్గు, జర్వంతో బాధపడుతున్నాడు. దీంతో సోమవారం కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ఉలిక్కిపడ్డారు. వెంటనే వైద్యులు అతని భార్య, కుమారుడు, వారింట్లో అద్దెకు ఉంటోన్న భార్యభర్తలతోపాటు వారి ఐదేళ్ల బాబును హోం క్వారంటైన్ చేశారు.

దీంతోపాటు పనిచేస్తున్న సెలూన్ ఇద్దరు, కటింగ్, షేవింగ్ చేయించుకున్న ఐదుగురు వివారలు సేకరించారు. వారి రక్తనమూనాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నవీన్‌కు వైరస్ సోకడంతో మల్లిఖార్జున నగర్ ఉలిక్కిపడింది. అతని స్నేహితులు.. పక్కింటి, ఎదురింటి వారు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వారి వివరాలను ఆరోగ్య సిబ్బంది సేకరించారు. నవీన్ ఇంటి చుట్టుపక్కల గల వీధుల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది స్ప్రే చేశారు.
-
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications