బీర్ల సేల్స్ హై.. గతేడాది కన్నా పెరిగిన విక్రయాలు.. గ్రేటర్‌లో జోరుగా అమ్మకాలు
ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడి ఉంటుంది. ఉక్కపోతతో జనం అల్లాడే పరిస్థితి ఏర్పడింది. వేడి నుంచి సేదతీరేందుకు శీతల పానీయాలకు డిమాండ్ ఎక్కువే.. అయితే బీర్లు కూడా ఎక్కువగానే సేల్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల విక్రయాలు మంచినీళ్ల మాదిరిగా జరుగుతున్నాయి. గతేడాది కరోనా వల్ల అంతగా లేదు.. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్దం.

బీర్ల వైపు మొగ్గు..
పగటి ఉష్ణోగ్రతలు 45డిగ్రీలకు పైగా రికార్డు అవుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు పలు రకాల డ్రింక్స్ తీసుకుంటున్నారు. పండ్ల జ్యూస్ లు, కొబ్బరి బోండాలు సేవిస్తూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇక మందుబాబులు గురించి చెప్పక్కర్లేదు. వేసవి తాపాన్ని తీర్చుకొనేందుకు బీర్ల వైపు చూపు మళ్లించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి.

బీర్లదే హవా
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జనవరి నుంచి మే 15 వరకు జరిగిన మద్యం విక్రయాల్లో బీర్లదే హవా సాగింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ గణాంకాలు రుజువు చేస్తున్నాయి. గ్రేటర్ పరిధి మూడు జిల్లాల్లో మద్యం విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి మే 15 వరకు రంగారెడ్డి జిల్లాలో 4,68,56,640, హైదరాబాద్‌లో 1,74,20,700, మేడ్చల్ జిల్లాలో 97,16,424 బీర్లు విక్రయాలు జరిగాయి. గత ఏడాది తొలి ఐదు నెలల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో బీర్ల విక్రయాల ద్వారా రూ. 150 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు రాగా, ఈ ఏడాది ఇప్పటికే రూ. 262కోట్ల మేర విక్రయాలు జరిగాయి. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

పెరిగిన ఆదాయం
రంగారెడ్డి జిల్లాలో గతేడాది 483 కోట్లు రాగా, ఈ ఏడాది ఇప్పటికే 703 కోట్ల ఆదాయం వచ్చింది. మేడ్చల్ జిల్లాలో గతేడాది రూ. 59 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటికే రూ.146 కోట్ల ఆదాయం బీర్ల విక్రయాల ద్వారా ఎక్సైజ్ శాఖకు చేరింది. సమ్మర్‌లో మందుబాబులు బీర్ల వైపు మొగ్గుచూపారు. వేడి నుంచి రిలీఫ్ పొందడానికి బీర్లు సేవిస్తున్నారు. నలుగురు యువత కలిస్తే చాలు.. కేసులు సేల్ అవుతున్నాయి. పండగ, పబ్బం పేరుతో సేల్స్ మరింత పెరిగాయి. దానికితోడు లైట్ బీర్ ధరను ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం రూ.10 తగ్గించిన సంగతి తెలిసిందే. ఒక్క బీర్ రూ.140కే వస్తోంది. సో.. మందుబాబులు పండగ చేసుకుంటున్నారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications