హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీల్ మామ.. ఎండ వేడికి బీర్ కొడుతోన్న యూత్, తెలంగాణ, హైదరాబాద్‌లో ఇలా..

|
Google Oneindia TeluguNews

ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళితే.. పెదవులు అరడం ఖాయం. అందుకే జనాలు గొడుగు పట్టుకొని వెళ్లాల్సి వస్తోంది. తలపై క్యాప్, లేదంటే రుమాలు.. లేదా పలుచని టవల్ వేసుకోవడం ఉత్తమం. సమ్మర్‌లో నిమ్మరసం, పుదీనా జ్యూస్.. ఇతర జ్యూస్ సేల్స్ ఎక్కువ. నిమ్మ రసం తీసుకోవడంతో ఎండ నుంచి తక్షణమే ఉపశమనం కలుగుతుంది. ఇక ఏదైనా ఊరు లేదంటే ఫంక్షన్‌కు వెళితే మందు కంపల్సరీ.. అసలే సమ్మర్ అయినందున.. బీర్ అంటేనే చీల్ బ్రో అని అంతా అంటారు.

బీర్ సేల్స్ హై

బీర్ సేల్స్ హై

ఎండ వేడిమికి జనం అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. బయటకు వచ్చినా.. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. కూల్ డ్రింక్స్, జ్యూస్ తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. మందుబాబులు వైన్స్ షాప్స్ ఎదుట క్యూ కడుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం కోసం చల్లటి 'బీర్లు' కోసం ఏకంగా వెయిట్ చేయాల్సి వస్తోంది. బీర్ల సేల్స్ ఒక్కసారిగా పెరిగాయి.

బీర్ల కోసం డిమాండ్

బీర్ల కోసం డిమాండ్


గ్రేటర్‌లో బీర్ల కోసం ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని వైన్స్ షాప్స్‌లలో చల్లటి బీర్లు దొరక్క మందుబాబులు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అత్యధికంగా బీర్లు సేల్స్ జరుగుతున్నాయి. రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తోంది. మూడు జిల్లాల్లో మార్చి, ఏప్రిల్ నెలలో 21,68,537 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.

ఏప్రిల్‌లో 1.85 లక్షల కేసులు

ఏప్రిల్‌లో 1.85 లక్షల కేసులు

హైదరాబాద్ లో 2.7 లక్షల కేసులకు పైగా మద్యం విక్రయాలు జరిగితే.. ఏప్రిల్‌లో 1.85 లక్షల కేసులు మాత్రమే అమ్మడుపోయాయి. రంగారెడ్డి జిల్లాలో మద్యం విక్రయాలు 4.33 లక్షల కేసులు, ఏప్రిల్‌లో 3.97 లక్షల కేసులకు తగ్గాయి. ఆదాయంలో కూడా తేడా వచ్చింది. గత నెలలో రంగారెడ్డి జిల్లాలో అన్ని రకాల మద్యం, బీర్ల అమ్మకాలపై రూ. 389 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెలలో రూ. 398.32 కోట్ల మద్యం అమ్మకాల ద్వారా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

తగ్గని బీర్ల క్రేజ్

తగ్గని బీర్ల క్రేజ్

మద్యం విక్రయాలు తగ్గినా.. బీర్ల అమ్మకాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 19.30 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగితే.. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 32.72 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని సమాచారం. మే నెలలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో వచ్చె నెలలో కూడా బీర్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరూ చీల్ మామా అంటూ.. బీర్ కొడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం వస్తోంది.

English summary
beer sales high in the telangana state. youth are chill to drunk beer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X