• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Bigg Boss Telugu:అవినాష్‌ లైఫ్‌లో ఆ అమ్మాయి ఎవరు..? లవ్‌ స్టోరీ బ్రేకప్ కథ ఏంటి..?

|

హైదరాబాదు: కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ రియాల్టీ షో ఇప్పుడిప్పుడే రక్తి కడుతోంది. బిగ్‌బాస్ టాస్కులు ఇచ్చిన సమయంలో కంటెస్టెంట్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ప్రతి ఒక్కరూ హౌజ్‌లో ఉండేందుకు మాత్రమే ఆట ఆడుతున్నారు. అందులోనూ చాలా తెలివిగా ఆడుతున్నారు. ఇక బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ అవేమీ పట్టించుకోని కంటెస్టెంట్స్ తాము మాత్రం సేవ్‌ అయ్యేలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంటిలోకి ప్రవేశించిన అవినాష్ మాత్రం ఫుల్ టూ ఎంటర్‌టెయినర్‌గా తయారయ్యాడు. అయితే అందరినీ నవ్వించే అవినాష్‌లో కూడా ఓ విషాదం దాగి ఉందనేది చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.

 వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌తో హౌజ్‌లోకి

వైల్డ్ కార్డ్ ఎంట్రీ‌తో హౌజ్‌లోకి

బిగ్‌బాస్ షో తెలుగులో సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. ఇక కంటెస్టెంట్లు ఇంటిలోకి అడుగుపెట్టగానే ప్రేక్షకుల్లో ఏదో తెలియని వెలితి. అదేంటంటే ఈ సారి పెద్దగా పరిచయం లేని సెలబ్రిటీలు ఇంటిలోకి అడుగుపెట్టడం. దీంతో షో ప్రారంభమైన తొలినాళ్లలో పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఇక ఇంట్లో మరేదో మిస్ అవుతోందని గమనించిన నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా జబర్దస్త్ అవినాష్‌ను ప్రవేశపెట్టారు. బిగ్‌బాస్‌లో అవకాశం రాగానే మల్లెమాలకు గుడ్‌బై చెప్పేసిన అవినాష్ హౌజ్‌లోకి ఎంటర్ అయ్యాడు. హౌజ్‌లోకి ఎంటర్ కాగానే తన ఎంటర్‌టెయిన్‌మెంట్‌ షురూ చేశాడు. ఇటు చూసే ప్రేక్షకులు కూడా ముక్కు అవినాష్ ఆన్‌స్క్రీన్ ప్రెసెన్స్ కోసం ఎదురు చూశారు.

 అవినాష్ జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ

అవినాష్ జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ

ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం తక్కువ కాకుండా అవినాష్ ఓ వైపు తన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టెయిన్ చేస్తూ మరోవైపు హౌజ్‌లో తన గేమ్‌ను చాలా ప్లాన్డ్‌గా ఆడుతున్నాడు. అవినాష్‌ మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి. అందరినీ ఎంతో ఎంటర్‌టెయిన్ చేసే అవినాష్ వెనక కూడా ఓ బ్రేకప్ లవ్‌ స్టోరీ ఉంది. దీన్ని తన సోదరుడు అజయ్ స్వయంగా ఓ ఛానెల్‌తో చెప్పాడు. తాము మొత్తం ముగ్గురు అన్నదమ్ములమని అంతా ఒకే హాస్టల్‌లో ఉండి చదువుకునేవారని ఆ సమయంలో అవినాష్ ఒక అమ్మాయిని తెగ ఇష్టపడేవాడని గుర్తు చేశాడు అజయ్. నిత్యం ఆ అమ్మాయి వెంటే తిరిగేవాడని చెప్పాడు. ఆ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ అవినాష్ ఉండేవాడని ఈ జూనియర్ జబర్దస్త్ స్టార్ చెప్పాడు.

 ఇద్దరి మధ్య ఏం జరిగింది..?

ఇద్దరి మధ్య ఏం జరిగింది..?

ఇక తన పాత రోజులు గురించి చెప్పిన అజయ్.. ఒక రోజు అవినాష్‌ను స్వీట్ కొనేందుకు రూపాయి అడుగగా ఇవ్వలేదని చెప్పాడు. అది విన్న ఆ అమ్మాయి తనను పిలిచి రూపాయి ఇచ్చిందని గుర్తుకు చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి డబ్బు అవసరమైనప్పుడల్లా ఆ అమ్మాయినే అడిగేవాడినని ఛానెల్‌తో పలు విషయాలను అజయ్ షేర్ చేసుకున్నాడు. ఆ వయస్సులో ఏమి పిలవాలో తెలియక అక్క అని పిలిచేవాడినని అజయ్ వెల్లడించాడు. తన అన్న అవినాష్ చదువు ముగిశాక స్కూలును వదిలి వెళ్లిపోగా తాను మాత్రం హాస్టల్‌లోనే ఉన్నట్లు అజయ్ చెప్పాడు. తన అన్న ఆ అమ్మాయితో ప్రేమిస్తున్నట్లు చాలా ఆలస్యంగా తెలిసిందని అజయ్ చెప్పాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. వారిద్దరూ విడిపోయి వారి లవ్ స్టోరీకి బ్రేక్ పడిందని గుర్తు చేశాడు అజయ్.

  Bigg Boss Telugu 4 Turns As Boring Boss || Oneindia Telugu
   కెరీర్ పై ఫోకస్.. గెలిపించండి

  కెరీర్ పై ఫోకస్.. గెలిపించండి

  ఇక ఆ తర్వాత అవినాష్ తన కెరీర్‌పై దృష్టి సారించాడని చెప్పుకొచ్చాడు అజయ్. అవినాష్ చిన్నప్పటి నుంచే మిమిక్రీ చేసేవాడని చెప్పిన అజయ్.. తనలోని టాలెంట్‌ను గుర్తించిన స్కూలు ప్రిన్సిపాల్ తనను ప్రోత్సహించాడని అజయ్ వివరించాడు. ఇప్పుడు అన్ని ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించి ఈరోజు తన అన్న అవినాష్ ఈ స్థాయిలో ఉన్నాడని భావోద్వేగానికి గురయ్యాడు అజయ్. ఈ క్రమంలోనే తన అన్న జీవితంలో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని కోరిన అజయ్ తన అన్నకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించాడు.

  English summary
  Jabardasth comedian Avinash who entered the Bigg Boss house on wild card had a breakup love story which his brother Ajay revealed it.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X