వెంబడించిన మృత్యువు.. వాహనం నుంచి కిందపడగానే.. వెళ్లిన బస్సు వెనకటైరు.. మృతి..
విధి ఎంత విచిత్రంగా ఉంటుందో.. జరిగే సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఓ యువతి స్నేహితుడితో కలిసి ఎగ్జామ్ కోసం వెళ్తుండగా ప్రమాదం కబళించింది. యాక్సిడెంట్‌లో యువతికి చనిపోగా. ఆమె స్నేహితుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్ నడిబొడ్డు చాదర్‌ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి ఫుటేజీలో యువతి తల టైర్ కింద నలిగిపోయినట్టు స్పష్టంగా కనిపించింది.
మలక్‌పేటలో ఉంటున్న కావ్య అనే విద్యార్థిని.. తన స్నేహితుడితో కలిసి పరీక్ష రాసేందుకు బయల్దేరారు. చాదర్‌ఘాట్ వద్దకు బానే వచ్చారు. అయితే అతుకులు, గతుకుల రోడ్డు కావడంతో కాస్త మెల్లిగానే వెళుతున్నారు. గతుకు ఉండటంతో టూవీలర్ స్లో చేశాడు. ఇంతలో స్కిడవడంతో ఇద్దరు వాహనంపై నుంచి పడిపోయారు. లేద్దామనుకునేలోపే.. మృత్యువు వెంబడించింది. అటుగా వస్తోన్న బస్సు యువతి తలపైనుంచి వెళ్లింది. దీంతో ఆమె హాహాకారాలు పెడుతూ ఊపిరి వదిలింది. టైర్‌కు కాసింత దూరంలో ఉన్న యువకుడు కూడా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతనిని సమీప ఆస్పత్రికి తరలించారు.

కావ్య మృతితో విషాదఛాయలు అలుముకొన్నాయి. రోడ్డు సరిగా లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు చెప్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తమ బిడ్డును బలి తీసుకుందని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. కావ్య పేరెంట్స్ వాదన ఇలా ఉంటే.. అక్కడ రహదారి సరిగానే ఉందని మున్సిపల్ అధికారులు సెలవిస్తున్నారు. వారి వాహనం స్కిడ్ కావడం వల్లే పడిపోయారని చెప్పారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ పీఆర్వో ఒకరు నోట్ కూడా విడుదల చేశారు. స్కిడ్ కావడం వల్లే వారు ప్రమాదానికి గురయ్యారే తప్ప.. అందులో తమ తప్పేమి లేదని తేల్చిచెప్పారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications