హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ సర్కారు ప్రజల ప్రాణాలు తీస్తోంది: కవిత, తెలంగాణ సినిమాను చంపేశారంటూ సీవీఎల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, సినీ దర్శకుడు శంకర్‌పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నేత కవిత, సినీనటుడు సీవీఎల్ నరసింహారావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వీరు మాట్లాడారు. శంకర్ మాటలు సినిమా స్క్రిప్టుకే పనికి వస్తాయని, అభివృద్ధి అంటే మోఖిలాలో 50 ఎకరాలు తీసుకోవడమేనా? అని నరసింహారావు ప్రశ్నించారు.

హిందువులను చంపేస్తామంటే మాట్లాడలేదే?

హిందువులను చంపేస్తామంటే మాట్లాడలేదే?


హిందువులకు అండగా ఉంటామన్నందుకు ఇంత రచ్చ చేస్తారా? అరాచకాలు.. అల్లకల్లోలం చేస్తున్నారు అంటారా? అని ప్రశ్నించారు. అంతేగాక, హిందువులను చంపేస్తా.. ఆవులను చంపేస్తా అంటే అప్పుడు మాట్లాడలనిపించలేదా? అని నరసింహారావు నిలదీశారు. భాగ్యలక్ష్మి ఆలయానికి ఎవరూ వెళ్లొదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ సినిమాను చంపేశారు: నర

తెలంగాణ సినిమాను చంపేశారు: నర

సినిమా అభివృద్ధికి ఫిలిం డెవలప్‌మెంట్ అభివృద్ధి లేదని, ప్రభుత్వం తరపున తెలంగాణ డైరెక్టర్లకు సాయం లేదని అన్నారు. చిత్రపురిలో అర్హులకు ఎందుకు ఇళ్లు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. సినిమా వాళ్లు కానీ, వాళ్లను ఎందుకు పంపించడం లేదన్నారు. సినీ అవార్డులు ఇస్తున్నారా? సినిమా రంగంలో తెలంగాణ నుంచి ప్రతినిధులు ఉన్నారా? అని నరసింహారావు నిలదీశారు. సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలని, తెలంగాణ సినిమాను చంపేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ కవిత..

ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ కవిత..

బీజేపీ నేత, సినీ నటి కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో నగరం అస్తవ్యస్థంగా మారిందని, గతుకుల రోడ్లతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. నాలాల్లో చిన్నపిల్లలు పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధిత ప్రజలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్వం కోల్పోయిన ప్రజలను మీ సేవ ముందు నిలబెట్టి ఓ మహిళ ప్రాణం తీశారని మండిపడ్డారు. ప్రజలకు కావాల్సింది మాటలు కాదని.. సాయమని కేటీఆర్‌కు చురకలంటించారు. ఆరేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని, చర్చకు రావాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఏం చేస్తుందో చేసి చూపిస్తామని కవిత అన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీ గెలవాలని ఆమె అన్నారు.

English summary
bjp leader kavitha and cvl narasimha slams kcr and ktr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X