హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నీళ్లే మిగిలాయి.. నీట మునుగుతున్న 10 వేల ఎకరాల పంట: రాములమ్మ

|
Google Oneindia TeluguNews

సమయం దొరికితే చాలు.. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి విరుచుకుపడుతుంటారు. ఇవాళ మరోసారి ఫైరయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కేసీఆర్‌కు కమీషన్లు తెచ్చిపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మంచిర్యాల జిల్లా రైతులకు కన్నీళ్లు మిగులుస్తోందని ధ్వజమెత్తారు. బ్యారేజీల బ్యాక్​వాటర్​తో ఏటా 10 వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని విరుచుకుపడ్డారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలతో చెన్నూర్​ నియోజకవర్గంలోని జైపూర్, చెన్నూర్, కోటపల్లి, బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలాల్లోని రైతులు ఏటా రూ. 50 కోట్లకు పైగా పంట నష్టపోతున్నారని వివరించారు.

మూడేళ్ల నుంచి..

గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని స్థానిక రైతులు తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన టీఆర్ఎస్ సర్కార్ ప్రజల సాధకబాధకాలపై పట్టింపులేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం బ్యాక్​వాటర్​తో 2019 నుంచి పంటలు మునుగుతున్నాయని వివరించారు. రైతులు జులైలో పత్తి, మిర్చి, వరి పంటలు వేసుకుంటుంటే ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో వరదలొచ్చి పంటలను ముంచేస్తున్నాయని గుర్తుచేశారు.

చేతికిరానీ పంట

చేతికిరానీ పంట

సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో వాటర్ స్టోర్​ చేయడం, వరదలు వచ్చినప్పుడు ఒకేసారి గేట్లు ఓపెన్​ చేయడం వల్ల బ్యారేజీల కింద పంటలు చేతికి రాకుండా పోతున్నాయని వివరించారు. వరద నేరుగా వెళ్లక బ్యాక్​వాటర్ ​పొలాలను ముంచెత్తుతోందని పేర్కొన్నారు. ఇటీవల ఇలా పొలాలు మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. బ్యారేజీలు కట్టేటప్పుడు ఇరిగేషన్​ ఆఫీసర్లు అంచనా వేసిన వరద కంటే రెండు లక్షల క్యూసెక్కులు అధికంగా వస్తుందని విశ్వసనీయంగా తెలిసిందని తెలిపారు. ముంపును నివారించేందుకు గోదావరి పొడవునా కరకట్టలు నిర్మించాలని రైతులు కోరుతున్నా.. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు.

కమీషన్ల కోసం..

కమీషన్ల కోసం..

కమీషన్ల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి బ్యారేజీలు కట్టిన సర్కారు అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే కరకట్టలు ఎందుకు నిర్మించడం లేదో తెలపాలని విజయశాంతి ప్రశ్నించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ సర్కార్ రైతుల బాధలను అర్థం చేసుకోవాలని హితవు పలికారు. వారి వెతలను ఆలకించాలని కోరారు. హైకోర్టు తీర్పును గౌరవించి, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సూచించారు. లేదంటే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పడం ఖాయం అని విజయశాంతి హెచ్చరించారు.

Recommended Video

బండి సంజయ్ పై మండి పడ్డి గులాబి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి!! || Oneindia Telugu
ఇదీ తగదు

ఇదీ తగదు


ప్రజలతో ఎందుకు ఆటలు ఆడుకుంటున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. ప్రభుత్వం మొత్తం ఫోకస్ హుజురాబాద్‌పై మాత్రమే పెట్టిందని చెప్పారు. మరీ రాష్ట్రంలోని మిగతా ప్రజలు ఏం చేశారని అడిగారు. వారి సాధక బాధకాలు వద్దా అని నిలదీశారు. ఎన్నిక ఉంటేనే.. పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. మరీ మిగతా జనం ఏం కావాలి అని అడిగారు. రాష్ట్రంలో గల అందరినీ ఓకేలా చూడాలని కోరారు. స్వార్థం రాజకీయాలను ఇకనైనా పక్కనపెట్టాలని సజెస్ట్ చేశారు. తీరు మార్చుకోవాలని.. అందరికీ సమన్యాయం అందజేయాలని సూచించారు. లేదంటే ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు వస్తోందని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ చేసింది తక్కువ.. చెప్పేది ఎక్కువ అని విజయశాంతి విరుచుకుపడ్డారు.

English summary
bjp leader vijayashanti angry on telangana government. 10 thousand acre land are drown she alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X