హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాతబస్తీలో హైఅలర్ట్ - రోడ్లన్నీ క్లోజ్: ట్రాఫిక్ మళ్లింపు: అడ్వైజరీ ఇదే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సస్పెన్షన్‌కు గురైన భారతీయ జనతా పార్టీ గోషామహల్ శాసన సభ్యడు టీ రాజా సింగ్.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన ప్రకంపనల తీవ్రత సద్దమణుగుతోంది. నగర వ్యాప్తంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తోన్నాయి. పాతబస్తీలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఈ విషయంలో హైదరాబాద్ నగర పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలు ఫలించాయి.

నిరసనలతో..

నిరసనలతో..

రాజా సింగ్‌కు బెయిల్ లభించిన అనంతరం- పాతబస్తీలో వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. చార్మినార్, బార్కస్, చంద్రాయణ గుట్ట, షాలిబండ, డబీర్ పుర, ఫత్తర్ ఘట్టి, మొఘల్‌పుర, ఖిల్వత్, కాలా పత్థర్, అఫ్జల్ గంజ్, ఆసిఫ్ నగర్ వంటి ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త కొనసాగింది. ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో ఆయా ప్రాంతాలన్నీ హోరెత్తాయి.

ముందుజాగ్రత్త చర్యలతో..

ముందుజాగ్రత్త చర్యలతో..

ఏఐఎంఐఎం కార్యకర్తలు, పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు సభలను నిర్వహించారు. రాజా సింగ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. కొన్ని చోట్ల పోలీసులు-ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ ఎస్‌ఐ సహా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. పాతబస్తీలో ఈ తరహా వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భావించిన హైదరాబాద్ నగర పోలీసులు పలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నారు.

కఠిన చర్యలకు ఆదేశం..

కఠిన చర్యలకు ఆదేశం..


ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు. ఆందోళన కారుల ప్రదర్శనలు కట్టుతప్పకుండా చూసుకున్నారు. అటు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన కదిలింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌​లో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దంటూ ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలను తీసుకోవడంలో వెనుకాడొద్దని చెప్పారు.

రోడ్లు మూసివేత..

రోడ్లు మూసివేత..


మరోవంక- వినాయక చవితి పండగ రాబోతోన్న నేపథ్యంలో.. పాతబస్తీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. పాతబస్తీకి వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేశారు. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లించారు. ఈ మేరకు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. బుధవారం నుంచే ఇది అమల్లోకి వచ్చింది. గణేష్ నిమజ్జనం వరకూ ఈ ట్రాఫిక్ అడ్వైజరీ కొనసాగొచ్చు.

 ట్రాఫిక్ మళ్లింపు..

ట్రాఫిక్ మళ్లింపు..

పురానాపూల్, మొజంజాహీ, నయా పూల్, శివాజీ బ్రిడ్జి, చాదర్‌ ఘాట్, చాదర్‌ఘాట్ కాజ్ వే, మూసారాంబాగ్ బ్రిడ్జి వైపు నుంచి పాతబస్తీ, మలక్‌పేట్, ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనాలను 100 ఫీట్ రోడ్, జియాగూడ, రామ్‌సింగ్ పుర, అత్తాపూర్, ఆరాంఘర్, మైలార్ దేవ్ పల్లి, చాంద్రాయణగుట్ట మీదుగా మళ్లించారు.

 పాతబస్తీకి వెళ్లాలంటే..

పాతబస్తీకి వెళ్లాలంటే..

మొజంజహీ మార్కెట్ నుండి నయాపూల్ బ్రిడ్జి, శివాజీ బ్రిడ్జి మీదుగా ఓల్డ్ సిటీకి వెళ్లే వాహనదారులను రంగమహల్, చాదర్ ఘాట్, నింబోలిఅడ్డ, టూరిస్ట్ జంక్షన్, బర్కత్ పుర్, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, తార్నాక వైపు మల్లించారు. అబిడ్స్, కోఠీ వైపు నుంచి చాదర్ ఘాట్, చాదర్ ఘాట్ కాజ్ వే, మూసారాంబాగ్ బ్రిడ్జి మీదుగా మలక్‌పేట్, దిల్‌షుక్ నగర్, ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనాలను నింబోలి అడ్డ, టూరిస్ట్ హోటల్ జంక్షన్, బర్కత్ పుర, ఫీవర్ హాస్పిటల్, తార్నాక లేదా 6 నెంబర్ జంక్షన్, రామంతపూర్ వైపు మల్లించారు.

 ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా..

ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా..


పాతబస్తీ నుంచి నయాపూల్, మొజాంజాహి, పురానా పూల్ మీదుగా అబిడ్స్, కోఠీ, ఎంజే మార్కెట్, లక్డికాపూల్ వైపు వెళ్లే వాహనదారులు చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్ పల్లి, ఆరాంఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్, లక్డీకాపూల్ మీదుగా-
దిల్‌షుక్‌నగర్, ఎల్బీ నగర్ వైపు నుంచి మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ మీదుగా అబిడ్స్, కోఠీ, ఎంజే మార్కెట్ వైపు వెళ్లే వాహనాలు ఉప్పల్, తార్నాక, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్‌పుర మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.

English summary
BJP MLA Raja Singh row: Hyderabad police issued traffic advisory in Old city, high alert declare.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X