ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంపు.. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ...

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రతను పెంచారు. ఇటీవల ఢిల్లీల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో రాజాసింగ్ పేరు ఉన్నట్టు సమాచారం అందినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణ పోలీసులు అలర్టయి.. రాజాసింగ్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాజాసింగ్‌ను బైక్‌పై తిరగవద్దని సీపీ సూచించారు. రాజాసింగ్‌కు ప్రభుత్వం ఇచ్చిన బులెట్ ప్రూఫ్ కార్‌లోనే వెళ్లాలని స్పష్టంచేశారు. డీసీపీ స్థాయి అధికారి రాజాసింగ్ భద్రతా పర్యవేక్షిస్తారని సీపీ తెలిపారు.

bjp mla raja singh security increased..

Recommended Video

    NEET, JEE Main 2020 : No Postponement, Govt | 7 Non BJP States to Move Supreme Court || Oneindia

    భద్రత పెంచడంపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. తన గన్ మెన్ గన్స్ కూడా మార్చారని తెలిపారు. అయితే తనకు ఎవరి నుంచి ముప్పు ఉందొ చెప్పాలని కోరారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని తెలిపారు. గత కొన్ని రోజులుగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తున్నారు. కేసీఆర్ లక్ష్యంగా కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు ఉంది అని పోలీసులు భద్రత పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+