హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

11 మందికి తీవ్ర గాయాలు.. నానక్‌రామ్ గూడలో భారీ పేలుడు..

|
Google Oneindia TeluguNews

విశ్వనగరి హైదరాబాద్‌ మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నానక్ రామ్ గూడ భారీ పేలుడు సంభవించింది. ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మూడంతస్తుల భవనంలో ప్రమాదం జరిగింది. అందులో బిహార్‌కు చెందిన 50 మంది కూలీలు ఉంటున్నారు. ప్రమాదంలో పేలిన గ్యాస్ సిలిండర్ వాణిజ్య సిలిండర్ అని అధికారులు తెలిపారు. ఇంటిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ఎందుకు ఉపయోగిస్తున్నారో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మొత్తం 11 మందికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ఒక గ్యాస్ సిలిండర్ కు మూడు కనెక్షన్స్ ఇవ్వటం వల్లే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. గ్యాస్ ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్‌ లీకేజీ అయిందని.. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో లైట్స్ ఆన్ చేయడం వల్ల భారీ పేలుడు సంభవించిందని తెలుస్తోంది.

 blast at hyderabad nanakram guda, 11 injured

Recommended Video

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మెరుపు సమ్మె చేసిన కాంగ్రెస్ నేత వీహెచ్ | Oneindia Telugu

ప్రమాదంలో గాయపడిన వారంతా బిహార్‌ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు తెలిపారు. వీరంతా హైదరాబాద్ వచ్చి పనులు చేసుకుంటున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 5 గంటలకు పేలుడు సంభవించిందని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

English summary
gas cylinder blast at hyderabad nanakramguda. 11 bihar people injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X