హైదరాబాద్‌లో పేలుడు: వ్యక్తికి తీవ్రగాయాలు
హైదరాబాద్: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. వైట్‌హౌస్ హోటల్ సమీపంలో చెత్త డబ్బాలో పేలుడు సంభవించడంతో.. నాగయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. నాగయ్య చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. చెత్తకుప్పలో ఉన్న పెయింట్ డబ్బా పేలి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం పేలుడు ఘటనలో గాయపడిన వ్యక్తికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలిసింది.












Click it and Unblock the Notifications