• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అఖిలప్రియకు వైద్య పరీక్షలు -గాంధీ నుంచి రిమాండ్‌కు -పరారీలోనే భర్త భార్గవరామ్ -కేసీఆర్ బంధువులతో..

|

తెలుగుదేశం పార్టీ కీలక నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సంచలనాత్మక 'బోయినపల్లి కిడ్నాప్' వ్యవహారంలో అఖిలప్రియ ప్రమేయంపై ప్రాధమిక ఆధారాలు లభించడంతో బుధవారం ఆమెను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బంధువులు కావడంతో ఈ కేసులో పోలీసులు వేగంగా వ్యవహరిస్తున్నారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే..

హిందూపురం: బాలయ్యకు షాక్ -జగన్ కుటుంబ చరిత్రే అంత -ప్రత్యేక రాష్ట్రం తేస్తానని హామీ

అఖిలప్రియకు వైద్య పరీక్షలు

అఖిలప్రియకు వైద్య పరీక్షలు

కిడ్నాప్ కేసులో అరెస్టు తర్వాత అఖిలప్రియను బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ విచారణ అనంతరం ఏపీ మాజీ మంత్రిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాంధీ ఆస్పత్రిలో అఖిలప్రియకు వైద్యపరీక్షలు చేశారు. అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలించనున్నారు. ఈలోపే బెయిల్ పొందేందుకు భూమా వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ మీడియాతో మాట్లాడారు..

కొడాలి నానికి బాలకృష్ణ వార్నింగ్.. నోరు అదుపులో పెట్టుకో -మాట వినకుంటే ఇక చేతలే..

సినీ ఫక్కీలో కిడ్నాప్..

సినీ ఫక్కీలో కిడ్నాప్..

ఐటీ అధికారులమంటూ కిడ్నాపర్లు ఇంట్లోకి చొరబడ్డారు. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్‌ చేశారు. మూడు వాహనాల్లో ప్రవీణ్ ఇంటికి వచ్చిన దుండగులు.. తాము ఐటీ అధికారులమని పరిచయం చేసుకున్నారు. డాక్యుమెంట్లు సోదా చేస్తున్నట్లు నటించారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను బంధించారు. ఆ తర్వాత ప్రవీణ్, నవీన్, సునీల్‌లను వాహనాల్లో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. కుటుంబీకుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు సినిమా ఫక్కీలో కిడ్నాపర్లను ఛేజ్ చేసి పట్టుకున్నారు.

సీఎం కేసీఆర్‌కు బంధువులు..

సీఎం కేసీఆర్‌కు బంధువులు..

భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ ప్రేమయం ఉన్నట్లుగా భావిస్తోన్న ఓ భారీ భూవివాదం చివరికి కిడ్నాప్ కు దారి తీసినట్లు తెలుస్తోంది. సుమారు రూ.600 కోట్ల విలువైన భూమికి సంబంధించిన వివాదంగా ప్రచారంలో ఉన్న ఈ వ్యవహారంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరికి సమీప బంధువులైన ముగ్గురు వ్యక్తులు(ప్రవీణ్, నవీన్, సునీల్) మంగళవారం రాత్రి బోయినపల్లిలో కిడ్నాప్ కు గురయ్యారు. అంతేకాదు.. కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు కూడా. అన్నదమ్ములైన ఈ ముగ్గురు బాధితులను కారులో ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లు.. ప్రాణహాని తలపెట్టకుండా విడిచిపెట్టారు. బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్‌లను వికారాబాద్‌లో గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పరారీలోనే అఖిలప్రియ భర్త..

పరారీలోనే అఖిలప్రియ భర్త..

బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియతోపాటు ఆమె భర్త భార్గవ్‌రామ్‌ సోదరుడు చంద్రహాస్‌ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే, అఖిలప్రియ భర్త మాత్రం ఈ ఉదయం నుంచి పరారీలో ఉన్నాడు. హాఫీజ్‌పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్లు సమాచారం. చంద్రహాస్‌‌ను విచారిస్తే నిజాలు బయటపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కోర్టు అనుమతితో అఖిలప్రియను, చంద్రహాస్ ను పోలీసులు మరోసారి విచారించే అవకాశం ఉంది.

English summary
tdp leader and andhra pradesh farmer minister bhuma akhila priya has been sent to judicial custody after medical tests at gandhi hospital. hyderabad police arrested akhila priya on wednesday regarding bowenpally kidnap case. akhila priya husband bhargav ram currently absconding
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X