చేపమందు పంపిణీకి బ్రేక్.. ఉబ్బస వ్యాధిగ్రస్తులకు నిరాశ
కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గినా.. లాక్ డౌన్ మాత్రం కంటిన్యూ అవుతోంది. వేసవి కాలంలో కేసులు ఎక్కువ వస్తున్నందున ప్రభుత్వం మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. తెలంగాణ రాష్ట్రలో లాక్ డౌన్ పొడగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ఏటా మృగశిర కార్తె రోజు వేసే చేప మందు పంపిణీ ఈ సారి నిలిపివేశారు.
ఈ ఏడాది చేపమందు ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. లాక్ డౌన్, కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సారి చేపమందు ప్రసాదం పంపిణీ లేదని బత్తిని హరినాధ్ గౌడ్ తెలిపారు. ప్రమాదకర రీతిలో కరోనా కేసులు పెరగటం ప్రధాన కారణమని అన్నారు. ఈ నేపథ్యంలో మృగశిర కార్తె రోజున ఉబ్బసాన్ని తగ్గించడానికి ఇచ్చే చేపమందును పంపిణీ చేయలేకపోతున్నామని చెప్పారు. ఈసారి జూన్ 8న చేపమందు ప్రసాదం కేవలం ఇంట్లో వాళ్ళమే తీసుకుంటామని బత్తిని హరినాధ్ గౌడ్ చెప్పారు.

ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు బత్తిన సోదరులు చేప మందు పంపిణీ ఇస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వేళ.. భారీగా జనం వస్తే ఇబ్బందులు తప్పవు. వైరస్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకోసమే ఈ సారి చేప మందు పంపిణీ వేయడం లేదు. అయితే ఉబ్బస వ్యాధిగ్రస్తులకు మాత్రం నిరాశే కలిగింది. కరోనా కూడా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపడం.. ఉబ్బసం ఉన్నవారికి ఎక్కువ ఇంపాక్ట్ చూపుతోన్న సంగతి తెలిసిందే. దీనికితోడు చేపమందు పంపిణీ నిలిపివేయడం డిసప్పాయింట్‌కు గురిచేసింది.












Click it and Unblock the Notifications