తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు: జెండా ఎగరేసిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ సంబరాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్(టీఆర్ఎస్) ఆవిర్భవించి నేటికి(ఏప్రిల్ 27) 22 వసంతాలు పూర్తి చేసుకుని 23వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్బంగా పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరారవు, సంతోష్ కుమార్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనా చారి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నారు.

అనంతరం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలు తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
అక్టోబర్ 10న వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలతో ఎన్నికలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. త్వరలోనే విద్యార్థి, యువజన సమ్మేళనాల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ ఆవిర్భవానికి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు.

మరోవైపు, తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి, అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్. 22 ఏండ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు' అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మరో మంత్రి హరీశ్ రావు కూడా పార్టీ శ్రేణులకు, ప్రజలకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. 'స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.! ఉజ్వల భారత్ కోసం నేడు బీఆర్‌ఎస్. కేసీఆర్ గారి సారథ్యంలో 22ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసింది. అనతి కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి, దేశానికే రోల్ మోడల్ అయ్యింది.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్.
— BRS Party (@BRSparty) April 27, 2023
On the occasion of BRS Party formation day, BRS President and CM KCR garlanded the statue of Telangana Thalli… pic.twitter.com/NVIMYFjKPW
ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికింది. 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి మోడల్ ను దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరారు. దేశ అభివృద్ధి కోసం తెలపెట్టిన మహాయజ్ఞం జాతీయ స్థాయిలో విస్తరించి, మరిన్ని విజయాలు సాధించాలి. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని 'గులాబీ' అభిమానులకు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు.' అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications