కొండగట్టులో 1000 ఎకరాల బాధ్యత తీసుకున్న బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్

సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని కొండగట్టు పుణ్యక్షేత్రం పరిధిలోని కొడిమ్యాల అటవీ ప్రాంతం(1000 ఎకరాలకుపైగా)ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజును పురస్కరించుకుని కొండగట్టు పుణ్యక్షేత్రం పరిధిలోని కొడిమ్యాల అటవీ ప్రాంతం(1000 ఎకరాలకుపైగా)ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు సంతోష్ ప్రకటించారు.

రూ. 100 కోట్లతో కొండగట్టు అభివృద్ధి

రూ. 100 కోట్లతో కొండగట్టు అభివృద్ధి

జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రం కొలువై ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. రూ. 100 కోట్ల నిధులతో కొండగట్టు ఆలయాన్ని, పరిసరాలను ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా మరింతగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ తెలిపారు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రముఖ అర్కిటెక్ట్ ఆనంద్ సాయి కొండగట్టు ఆలయ పునర్నిర్మాణం కోసం పనిచేస్తుండటం గమనార్హం.

కొండగట్టులో 1000 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్న సంతోష్

సీఎం కేసీఆర్ నిర్ణయానికి మద్దతుగా కొండగట్టు అటవీ ప్రాంతాన్ని తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా దత్తత తీసుకుంటున్నట్లు రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గురువారం ప్రకటించారు. కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ కంపార్ట్‌మెంట్ 684లో 752 ఎకరాలు, కంపార్ట్‌మెంట్ 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల భూమిని దత్తత తీసుకోనున్నారు సంతోష్.

కొండగట్టు అడవుల కోసం ఎంపీ సంతోష్ రూ. కోటి నిధులు

కొండగట్టు అడవుల కోసం ఎంపీ సంతోష్ రూ. కోటి నిధులు


రూ. కోటితో ఈ అటవీ ప్రాంతాన్ని మరింతగా పచ్చదనంతో నింపుతామన్నారు ఎంపీ సంతోష్. దశలవారీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యమత్రి కేసీఆర్ పుణ్యక్షేత్రాల అభివృద్ధితోపాటు మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని, యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఇప్పుడు కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేసేదుకు శ్రీకారం చుట్టారని సంతోష్ కుమార్ చెప్పారు. తనకు కొండగట్టుతో చిన్నతనం నుంచి అనుబంధం ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చాలాసార్లు కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించినట్లు సంతోష్ కుమార్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+