మా ఊరికి బస్సులేదు సార్.. స్పందించిన సజ్జనార్..
ఆర్టీసీ ఎండీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సజ్జనార్.. ఒక్కో కీలక అంశంపై ఫోకస్ చేస్తున్నారు. ఏళ్లుగా జరగని పనులను చకచకా చేస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సంస్థకు ఆదాయంపై ఫోకస్ చేశారు. దసరా సమయంలో సిటీ నుంచి జనం ఊర్లకు వెళుతుంటారు. అప్పుడు అదనపు చార్జీ లేకుండా బస్సులను నడిపించారు. మంచి ఆదాయమే సమకూరింది. ఆర్టీసీలో కొన్ని విభాగాలకు కొలువులను ప్రకటించారు. దీంతోపాటు ఆర్టీసీ బస్సులను పెళ్లి కోసం బుక్ చేసుకుంటే గిప్టులను అందజేస్తున్నారు. ఈసారి జర్నలిస్టులకు కూడా గుడ్ న్యూస్ అందజేశారు. దాంతోపాటు సోషల్ మీడియాలో వచ్చిన సమస్యలను కూడా అంతే వేగంగా స్పందిస్తున్నారు.
ట్విట్టర్‌లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు సజ్జనార్ స్పందిస్తున్నారు. మరొ ట్వీట్‌కు సజ్జనార్ స్పందించారు. కరీంనగర్ నుంచి లక్సెట్టిపేట వరకు రాత్రి 9 గంటల తర్వాత ఆర్టీసీ బస్సు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని దండేపల్లి మండలం గూడెంకు చెంది తోట పవన్ వర్మ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు మంగళవారం ట్వీట్ చేశాడు. దీనికి ఆయన స్పందించారు. ఆర్టీసీ అధికారి పద్మావతికి పవన్ వర్మ నంబర్ ఇచ్చి సమస్య తెలుసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆమె పవన్ వర్మకు ఫోన్ చేసి సమస్య తెలుసుకుని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ట్విట్టర్ పోస్టుకు స్పందించిన సజ్జనార్‌కు పవన్‌వర్మ కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్టీసీ లాభాల్లోకి తీసుకురావడంపై ఫోకస్ చేశారు. వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. సజ్జనార్ మాత్రం ఆర్టీసీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. ఏళ్లుగా కానీ సమస్యను పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు సమస్యపై కూడా స్పందించారు. అందరికీ ఆర్టీసీ సేవలను అందజేస్తామని ఆయన తెలియజేశారు. ప్రగతి రథ చక్రాలు ప్రయాణికుల కోసమేనని వివరించారు. వారి కోసమే పనిచేస్తామని ఇండికేషన్స్ ఇచ్చారు. వారి సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. ఈ సారి బస్ సర్వీస్ కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల ప్రయారిటీ తమకు ఇంపార్టెంట్ అని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications