జెండా పండుగ: స్పీచ్ ఇస్తూ కుప్పకూలిన వ్యాపారి, గుండెపోటుతో కన్నుమూత
దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు త్రివర్ణ పతకం సగర్వంగా ఎగిరింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వేడుకలు కన్నుల పండువలా జరిగాయి. చిన్న, పెద్ద అంతా 75వ వజ్రోత్సవ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు.. ఎర్రకోట మీద ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగరవేశారు.
హైదరాబాద్ కుషాయిగూడలో మాత్రం విషాదం చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా వ్యాపారవేత్త ఉపన్యాసం ఇస్తున్నారు. అయితే అంతలో ఆయనకు గుండెపోటు వచ్చింది. లక్ష్మీ విల్లాస్ అపార్ట్‌మెంట్ వద్ద ఘటన జరిగంది. వ్యాపారి సురేశ్ కాలనీవాసులకు స్వాతంత్య్రం ముందు నాటి విశేషాలు చెబుతున్నారు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ వ్యాపారవేత్త అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత చనిపోయారు.
కుషాయిగూడలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పీచ్ ఇస్తూ గుండెపోటుతో మృతి చెందిన వ్యాపావేత్త..!!#Suresh #Telangana #TSNews #OneIndiaTelugu pic.twitter.com/bI5V5Rakwz
— oneindiatelugu (@oneindiatelugu) August 15, 2022

ఆజాదీ గురించి స్పీచ్ ఇస్తూ వ్యాపారి పడిపోయాడు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్ట్రోక్ వచ్చినా.. ఆయన కూర్చొండే ప్రయత్నం చేశారు. కానీ వీలులేకుండా పోయింది. ఒక్కసారిగా పడిపోయారు. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా నో యూజ్.. అప్పటికే చనిపోయారు.












Click it and Unblock the Notifications