ఘోర ప్రమాదం: గుంతలో పడిన కారు, ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామ శివారులోని మల్లన్న గుడి వద్ద కారు అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు గమనించి ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వ్యక్తిని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని స్వస్థలానికి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. మృతులు నల్గొండ జిల్లా బీబీనగర్‌కు చెందిన సమ్మయ, స్రవంతి, లోకేష్, రాజమణి, భవ్యశ్రీగా పోలీసులు గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు.
తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications