కోడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదు

హైదరాబాద్: కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన బాధితుడు సామ ఇంద్రపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2018లో ఉప్పరపల్లిలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు సామ ఇంద్రపాల్ రెడ్డి ప్రయత్నించారు. అదే సమయంలో మధ్యవర్తులుగా ఎమ్మెల్యే పట్నం నరేందర్, రాకేశ్ రెడ్డి అతనికి పరిచయమయ్యారు.

తమకు తెలిసిన మరికొందరు భూస్వాములు ఉన్నారని.. వీరిద్దరు శ్రీరామ్ రెడ్డి అనే మరో వ్యక్తిని ఇంద్రపాల్ రెడ్డికి పరిచయం చేశారు. స్థలం, కమీషన్‌తో కలిపి మొత్తం రూ. 3.65 కోట్లకు భూమి భూమి అమ్ముతామన్నారు. కమీషన్ ఇచ్చేందుకు ఇంద్రపాల్ కూడా అంగీకరించారు. ఈ క్రమంలో 2018 మే 24న రూ. 90 లక్షలు చెల్లించాడు. తర్వాత విడతల వారీగా మొత్తం రూ. 3.05 కోట్లు చెల్లించాడు. కాగా, సెక్యూరిటీ కింద ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డిలు బాధితుడి వద్ద బ్లాంక్ చెక్కులు తీసుకున్నారు.

case filed on Kodangal trs mla patnam narender reddy in banjara hills police station.

మిగిలిన రూ. 60 లక్షల కోసం లోన్‌కు అప్లై చేశానని.. అది రాగానే చెల్లిస్తానని చెప్పాడు. అయితే, ఈ సొమ్ము చెల్లించడానికి ఆలస్యం అవుతుందని.. ఎమ్మెల్యే తరపున అనుచరులు ఇంద్రపాల్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. గత ఏడాది జూన్ నెలలో తన ఇంటికి వచ్చి భార్యను బెదిరించారని, తనను గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని ఇంద్రపాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే తన గన్‌మెన్‌ను పంపించి చంపేందుకు ప్రయత్నించారని తెలిపారు. వారి చెర నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంద్రపాల్. అయినా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాను పోలీసులను ఆశ్రయించినప్పటి నుంచి రూ. 2.5 కోట్లు ఇస్తేనే గతంలో తాను ఇచ్చిన బ్లాంక్ చెక్కులపై ఎలాంటి చర్యలు తీసుకోమని.. డిమాండ్ చేసిన డబ్బును చెల్లించకపోతే చెక్ బౌన్స్ కేసు పెడతామని బెదిరించారని ఇంద్రపాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నేరుగా హైదరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లానని, అక్కడ్నుంచి కేసును పశ్చిమ మండలం డీసీపీకి రిఫర్ చేశారని బాధితుడు తెలిపారు.

కానీ, డీసీపీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించానని చెప్పాడు ఇంద్రపాల్. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డిపై పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఫిల్మ్ నగర్ పరిధిలో జరిగిన దృష్ట్యా అనంతరం కేసును ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసుపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+