రూ.5 కోట్లు లేవు.. డబ్బులు ఎక్కడికి పోలే, కేటీఆర్ ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డి
సుశీ ఇన్ ఫ్రాకు సంబంధించి రూ.5 కోట్ల లావాదేవీలపై మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఆధారాలను కూడా చూపించారు. కేటీఆర్ కామెంట్లను సుశీ ఇన్ ఫ్రా సీఈవో కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. ప్రచారంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సమాధానం ఇచ్చారు.
సుశీ ఇన్ ఫ్రాతో తనకు సంబంధం లేదని చెప్పారు. గత 13 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నానని వివరించారు. మునగోడులో ఓడిపోతామనే బాధతో ఇలా ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు. కుట్రపూరితంగా మాట్లాడటం సరికాదని సూచించారు. తమ కంపెనీ వ్యవహారాలు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టంచేశారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక ఇలా అధికార పార్టీ ఫైర్ అవుతుందని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఇచ్చిందని.. డబ్బులు లావాదేవీలు జరిగాయని మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.

అధికారం అడ్డం పెట్టుకొని దోచుకుంది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం అని రాజగోపాల్ రెడ్డి ఫైరయ్యారు. తాము కాదని స్పష్టంచేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు రిప్లై ఇచ్చామని తెలిపారు. సుశీ ఇన్ ఫ్రా నుంచి డబ్బులు ఎక్కడికీ పోలేదని తేల్చిచెప్పారు. మంత్రి కేటీఆర్ చూపిన డాక్యుమెంట్స్ అన్నీ ఫేక్ అని వివరించారు. ఆరోపణలు చేసిన వారిపై కేసు పెడతాం అని స్పష్టంచేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
మొత్తం రూ.5.22 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు నగదు బదిలీ జరిగిందని కేటీఆర్ అన్నారు. 16, 17, 18వ తేదీన ఈ ట్రాన్సాక్సన్స్ జరిగాయని తెలిపారు. నవ్య శ్రీ, దిండు భాస్కర్ పంతంగి ఇతరులకు నగదు పంపిణీ చేశారని తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ కూడా చేశామని వివరించారు. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బదిలీ చేశారని వివరించారు.












Click it and Unblock the Notifications