రూ.64 కోట్లు: మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డిపై ప్రశ్నల వర్షం.. రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వడంతోనే..

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్ మాల్ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. అరెస్ట్ చేసిన నిందితులను 7 రోజు కస్టడీకి పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే విచారిస్తున్న వారిలో కొందరిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రెండు రోజులుగా మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని కూడా విచారిస్తున్నారు. ఆయనతో పాటు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అధికారులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కొన్ని డిపాజిట్లకు సంబంధించి సోమిరెడ్డి రిలీజింగ్‌ ఆర్డర్‌ ఇచ్చినట్లు పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని సమాచారం. బ్యాంకులకు ఇచ్చిన రిలీజింగ్ ఆర్డర్‌పై ఆరా తీస్తున్నారు.

ఎంక్వైరీ..

ఎంక్వైరీ..

ఏపీ మర్కంటైల్ బ్రాంచ్‌ నుంచి డ్రా చేసిన డబ్బులు ఎక్కడికెళ్లాయనే అంశంపై విచారిస్తున్నారు. 64 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో తెలియడం లేదంటున్నారు. అరెస్ట్ అయిన వారి ఖాతాలో చిల్లిగవ్వ కూడా లేదు. అయితే రూ. 64 కోట్ల నిధులు ఆచూకీ తెలుసుకునేందుకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తెలుగు అకాడమీ మాజీ డైరెక్టర్ సత్యనారాయణను కూడా విచారిస్తామంటున్నారు సీసీఎస్ పోలీసులు.

అలా బదిలీ

అలా బదిలీ

63 కోట్ల రూపాయల డిపాజిట్లను అగ్రసేన్ బ్యాంకులోని ఏపీ మర్కంటైల్ సొసైటీ ఖాతాకు మళ్లించి అక్కడి నుంచి విడతల వారీగా నగదు విత్ డ్రా చేశారు. ఈ జనవరి నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు కూడా నగదును తీసుకున్నారు. ఏపీ మర్కంటైల్ సొసైటీ క్లర్క్‌ మొహిద్దీన్ నగదును నిందితులకు అందజేశారు. నగదు తీసుకున్నది ఎవరనే? కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీకి సహాయకుడిగా వ్యవహరించిన రాజ్ కుమార్.. ఈ తతంగంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇలా మోసం..

ఇలా మోసం..

రాజ్ కుమార్‌తోపాటు మరో ముగ్గురు ఏజెంట్లు కలిసి నకిలీ డిపాజిట్ పత్రాలు, లేఖలు సృష్టించి మోసానికి తెరలేపినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే మస్తాన్ వలీతోపాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌ను అరెస్ట్ చేశారు.

నలుగురు నిందితులను పదిరోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కస్టడీకి అనుమతిస్తే నలుగురు నిందితులను ప్రశ్నించడం ద్వారా మరికొంత సమచారం వచ్చే అవకాశం ఉందని సీసీఎస్ పోలీసులు అంటున్నారు.

సీరియస్ నెస్

సీరియస్ నెస్

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డిపై చర్యలు తీసుకుంది. అతనిని విధుల నుంచి తప్పించగా.. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ సహకార సంస్థ మేనేజర్ పద్మావతి, ఆ సంస్థ చైర్మన్ సత్యనారాయణ రాజు, అదే సంస్థకు చెందిన ఉద్యోగి మొయినుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మాయం

మాయం

హైదరాబాద్‌ కార్వాన్ యూనియన్ బ్యాంకు శాఖ నుంచే నగదు మాయం అయ్యాయి. గతేడాది జులై నుంచి విడతలవారీగా బ్యాంకులోని సొమ్ములో రూ.43 కోట్లు కాజేశారు. ఇదే బ్యాంకు సంతోష్ నగర్ బ్రాంచ్ నుంచి మరో రూ.8 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాయం అయ్యాయి. ఈ డబ్బును జులై, ఆగస్టు నెలల్లో దారి మళ్లించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

కెనరా బ్యాంకు నుంచి మరో రూ. 9 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము కూడా గోల్‌మాల్ చేశారు. ఈ కుంభకోణంలో రూ. 60 కోట్లకు పైగా సొమ్ము చేతులు మారినట్లు తేలింది. విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కారు అకాడమీ డైరెక్టర్.. సోమిరెడ్డిని పదవీ నుంచి తప్పించింది. ఈ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు అప్పగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+