కిషన్ రెడ్డి పర్యటన: సిటీలో జన ఆశీర్వాద సభ.. ఏర్పాట్లు పూర్తి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర కంటిన్యూ అవుతుంది. శనివారం హైదరాబాద్‌లో పర్యటన ఉంటుంది. ఉదయం 6 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కిషన్ రెడ్డి దర్శించుకుంటారు. ఘట్ కేసర్ వద్ద కేంద్రమంత్రికి మేడ్చల్ జిల్లా బీజేపీ ఘనస్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 12గంలకు ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర కిషన్‌రెడ్డికి హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో వెల్ కం చెబుతారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50 కిలోమీటర్ల మేర జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు బీజేపీ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు.
శనివారం ఉదయం భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలిస్తారు. స్థానికంగా రేషన్ షాపులను సందర్శించి ప్రజలకు ఉచిత బియ్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే జన ఆశీర్వాద యాత్రలో భాగంగా 12 జిల్లాలు, 7 పార్లమెంట్ స్థానాలు, 17 అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా 324 కిలోమీటర్ల మేర కిషన్‌రెడ్డి పర్యటన కొనసాగనున్న సంగతి తెలిసిందే.

నిన్న కిషన్ రెడ్డి తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి తిరుపతి నుంచి జన ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర రెండు రోజుల పాటు ఏపీలో, మూడు రోజుల పాటు తెలంగాణలో కొనసాగనుంది. ఇందులో భాగంగా విజయవాడ వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 'జన ఆశీర్వాద యాత్ర'ను ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల నుంచి శ్రీకారం చుట్టారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. కేంద్ర మంత్రులను పార్లమెంటులో పరిచయం చేసే అవకాశం రాకపోవడంతో బీజేపీ జాతీయ నాయకత్వం వారిని జనంలోకి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిషన్‌రెడ్డి మూడు రోజుల పాటు జన ఆశీర్వాద యాత్ర చేపట్టనున్నారు.
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ప్రతిపక్షాలను ఎండగట్టడం.. అజెండాగా దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. 2021, ఆగస్టు 19వ తేదీ గురువారం తిరుమలేశుడిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలోని వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications