చికోటి చిట్టా: తారలకు పారితోషికం ఇలా.. టాప్ ఎవరంటే..?
చికోటి ప్రవీణ్ జూన్ నెలలో నేపాల్‌లో ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి 200 మంది వరకు హాజరయ్యారట. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.5 లక్షల వరకు వసూల్ చేశారు. అయితే టాలీవుడ్, బాలీవుడ్ తారలను తీసుకొచ్చారు. వారితో ఆడి, పాడించారు. అందుకు వారికి భారీ మొత్తం ముట్టజెప్పారని తెలిసింది. ఒక్కొక్కరికి వారి రేంజ్ బట్టి నగదు ఇచ్చారు.
టాప్‌లో మల్లికా షెరావత్ ఉన్నారు. ఆమెకు రూ. కోటి ఇచ్చారట... తర్వాత నటి అమీషా పటేల్‌కు అందజేశారు. ఆమెకు రూ.80 లక్షలు ముట్టజెప్పారట.. ఆ తర్వాత గోవిందకు రూ.50 లక్షలు ఇచ్చారు. ఆయన కూడా మంచి డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. వీరు అందరితో డ్యాన్స్ చేయించి.. వచ్చినవారిని శాటిస్‌పై చేశారు. ప్రముఖులతో ప్రవీణ్ ఫోటోలు దిగారు.

డింపుల్ హయతికి రూ.40 లక్షలను ప్రవీణ్ అందజేశారు. ఈషా రెబ్బాకు రూ.40 లక్షలు ఇచ్చారు. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు రూ.20 లక్షలు ఇచ్చారు. గురువుకే కాస్త నగదు తక్కువ ఇచ్చారు. ముమైత్ ఖాన్‌కు రూ.15 లక్షల వరకు ముట్టజెప్పారట. ఇదీ ఇల్లీగల్ అయినందున.. వీరికి నోటీసులు జారీచేసే పనిలో ఈడీ నిమగ్నమైంది. ఆ నోటీసులకు వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌లో భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి.. నేపాల్, ఇండోనేషియాలో తరలిస్తున్నారనే సమాచారంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. చికోటీ ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. సైదాబాద్ ఐఎస్‌సదన్, బోయిన్‌పల్లి, సిటీ శివారులోని కడ్తాల్.. 8 ప్రాంతాల్లో 20 గంటల పాటు సోదాలు నిర్వహించారు. హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి ఆధారాలు సేకరించారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications