అక్షిత్ కిడ్నాప్..? 24 గంటలు గడిచినా దొరకని ఆచూకీ.. టెన్షన్
కిడ్నాప్ కేసుల సంఖ్య కూడా తక్కువేమీ కావడం లేదు. కొందరు ముఠాగా ఏర్పడి.. సమయం చూసి మరీ కిడ్నాప్ చేస్తున్నారు. నగరల్లో చిన్నారుల అదృశ్యం కలకలం రేపుతోంది. విశ్వనగరి హైదరాబాద్‌లో 13 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 13 ఏళ్ల బాలుడు మిస్సింగ్ చందానగర్‌లో కలకలం సృష్టిస్తోంది.
సోమవారం ఉదయం అక్షిత్ అనే 13 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. అక్షిత్ కనిపించకండా పోయి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్షిత్ మిస్సింగ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. నిన్నటి నుంచి కొడుకు కనిపించకపోవడంతో అక్షిత్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడి కోసం విసృతంగా గాలిస్తున్నారు.

బంధువులు, పోలీసులు గత 24 గంటల నుంచి గాలిస్తున్నా పసివాడి జాడ లభించడం లేదు. అక్షిత్ ఏమయ్యాడో..ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో అనే ఆందోళన నెలకొంది. తన బిడ్డను ఎక్కడున్నా తెచ్చి ఇవ్వాలని తెలిసిన వారందరిని వేడుకుంటున్నారు. వారిని చూస్తే జాలి కలుగుతుంది. తన కన్న జాడ తెలియజేయాలని తెలిసిన ప్రతీ ఒక్కరినీ అడుగుతున్నారు.
ఇవే కాదు చాలా కిడ్నాపులు జరుగుతున్నాయి. చాలా మంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ అక్షిత్ పేరంట్స్‌కు ఇంతవరకు కాల్ రాకపోవడంతో ఆందోళన కలుగుతుంది. అతను బాగానే ఉన్నాడా..? ఏమైనా అయ్యిందా అనే ఆందోళన నెలకొంది. పోలీసులు మాత్రం ఆచూకీ కోసం సెర్చింగ్ కొనసాగుతోందని స్పష్టంచేశారు. అతనికి ఏమీ కాదని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్షిత్ తల్లిదండ్రులు మాత్రం అరచేతిలో ప్రాణం పెట్టుకొని మరీ చూస్తున్నారు. తమ కుమారుడు క్షేమంగా ఉన్నారా లేరా అనే అంశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మాటే వారిని బతికిస్తోంది. కానీ ఆచూకీకి సంబంధించిన సమాచారం మాత్రం తెలియడం లేదు.












Click it and Unblock the Notifications