హైదరాబాద్ కేంద్రంగా చైల్డ్ పోర్న్ మాఫియా; యూఎస్ సైబర్ టిప్‌లైన్ సమాచారంతో రంగంలోకి పోలీసులు

హైదరాబాద్: హైదరాబాద్ లో పోర్న్ వీడియోల కలకలం రేగింది. హైదరాబాద్ కేంద్రంగా పోర్న్ గ్యాంగ్ చిన్నారుల పోర్న్ వీడియోలను అప్లోడ్ చేస్తున్నట్టు అమెరికాలోని సైబర్ టిప్‌లైన్ ద్వారా తెలంగాణ సిఐడి అధికారులకు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

హైదరాబాద్ లో చైల్డ్ పోర్న్ వీడియోల కలకలం

హైదరాబాద్ లో చైల్డ్ పోర్న్ వీడియోల కలకలం

హైదరాబాదులోని పలు ప్రాంతాల నుంచి పలు ఐపి అడ్రస్ ల నుండి చైల్డ్ పోర్న్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నట్టు గుర్తించిన సైబర్ టిప్‌లైన్ ఈ మేరకు తెలంగాణ పోలీసులను అలర్ట్ చేసింది. దీంతో హైదరాబాద్‌లో 3 ఐపి అడ్రస్ ల ద్వారా చైల్డ్ పోర్న్ వీడియో అప్‌లోడర్లను గుర్తించినట్లు తెలుస్తుంది. సైబర్ టిప్ లైన్ ఈ సమాచారాన్ని తెలంగాణ సిఐడి అధికారులకు అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి చైల్డ్ పోర్న్ మాఫియా గుట్టురట్టు చేసే పనిలో పడ్డారు.

హైదరాబాద్ నుండి మూడు ఐపీ అడ్రెస్ ల ద్వారా చైల్డ్ పోర్న్ వీడియోలు

హైదరాబాద్ నుండి మూడు ఐపీ అడ్రెస్ ల ద్వారా చైల్డ్ పోర్న్ వీడియోలు

సైబర్ టిప్‌లైన్ అనేది పిల్లల అశ్లీలత, లైంగిక వేధింపుల కోసం పిల్లలను ఆన్‌లైన్‌లో ప్రలోభపెట్టడం, ఫ్యామిలీలో పిల్లలను వేధించడం మరియు పిల్లలకు పంపిన అశ్లీల విషయాలతో సహా పిల్లల లైంగిక దోపిడీ కేసుల కోసం నిర్వహించబడే రిపోర్టింగ్ మెకానిజం. ఇక ఈ సైబర్ టిప్‌లైన్ అప్‌లోడ్ చేసిన వీడియోల ఆధారంగా హైదరాబాద్‌లో మూడు ఐపీ అడ్రస్‌లను గుర్తించి వివరాలను తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)కి అందించినట్లు తెలుస్తుంది.

హైదరాబాద్ లోని మూడు ప్రాంతాలను గుర్తించిన పోలీసులు

హైదరాబాద్ లోని మూడు ప్రాంతాలను గుర్తించిన పోలీసులు

టోలిచౌకి, రసూల్‌పురా మరియు వారాసి గూడ ప్రాంతాల్లోని వ్యక్తులు ఈ వీడియోలను అప్‌లోడ్ చేశారు. అవి 2017, 2019 మరియు 2020లో అప్‌లోడ్ చేయబడ్డాయని సమాచారం. రసూల్ పురాలో అప్లోడ్ చేసిన వీడియోలో నిందితుడు పోర్న్ ఫోటోగ్రాఫ్‌ల ద్వారా పిల్లల లైంగిక వేధింపుల విషయాలను పంచుకున్నట్లు నివేదించబడింది. మరొకటి అనుమానితుడు ఒక యువతి మరియు అబ్బాయి (11 ఏళ్లలోపు) తో సెక్స్ చేస్తున్న వీడియోను అప్లోడ్ చేసినట్టుగా గుర్తించారు. ఇది టోలిచౌకిలో అప్లోడ్ అయినట్టు గుర్తించబడింది. సైబర్ టిప్‌లైన్ రిపోర్టుల ఆధారంగా దర్యాప్తు చేసేందుకు సీఐడీ హైదరాబాద్ పోలీసులకు వివరాలను పంపింది.

ముగ్గురు నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు

ముగ్గురు నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు

ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తో, ముగ్గురు నిందితులపై కూడా కేసులు నమోదు చేయడానికి రెడీ అయింది. అదేవిధంగా, 2020లో పిల్లల పోర్న్ వీడియోలను అప్‌లోడ్ చేయడం మరియు ఫార్వార్డ్ చేయడం వంటి నేరాలతో ఇద్దరు అప్‌లోడర్‌లను అరెస్టు చేయగా, 2021లో దేశవ్యాప్తంగా చైల్డ్ పోర్న్ అప్‌లోడ్ చేసిన ముఠాలపై సీబీఐ దాడులు చేసింది. గత ఏడాది హైదరాబాద్‌కు చెందిన 16 మందిని కూడా అరెస్టు చేశారు.

సైబర్ టిప్‌లైన్ ద్వారా పిల్లల లైంగిక వేధింపులపై రాష్ట్రాలకు సమాచారం

సైబర్ టిప్‌లైన్ ద్వారా పిల్లల లైంగిక వేధింపులపై రాష్ట్రాలకు సమాచారం

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో , యూఎస్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదుర్చుకున్న తర్వాత 2019లో సైబర్ టిప్‌లైన్ ఏర్పాటు చేయబడింది. భారతదేశం యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మరియు మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ జాతీయ కేంద్రం (NCMEC), యూఎస్ భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సైబర్ టిప్‌లైన్ నివేదికలను పంపిస్తుంది. ప్రస్తుత ఈ నివేదిక ఆధారంగానే హైదరాబాద్లో చైల్డ్ పోర్న్ మాఫియా ను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+