ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం: సీఎం కేసీఆర్
కర్ణాటకలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో మినీ లారీని ఢీకొట్టి బస్సు అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో 8 మంది హైదరాబాదీలు చనిపోయారు. ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రమాదం జరగడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఇవ్వనున్నామని తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందేలా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావుకు నిర్దేశించారు. అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో 8 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. దీంతో విషాద వదనం నెలకొంది. రెండు కుటుంబాలకు చెందిన 32 మంది ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని గోవా విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గోవా నుంచి హైదరాబాద్ వస్తుండగా కలబురిగి జిల్లా కమలాపురలో ఓ మినీ లారీని ఢీకొట్టిన బస్సు.. కల్వర్టులో పడిపోయింది. క్షణాల్లో బస్సుకు మంటలు అవటుకుని తీవ్రరూపం దాల్చాయి.
ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, సహాయకుడు సహా 35 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు బయటకు దూకేశారు. గాయపడిన మరో 12 మందిని స్థానికులు కలబురిగి ఏరియా ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications