ఆ రైతు కుటుంబాలకు 3 లక్షలు, విద్యుత్ చట్టం వద్దు, బీజేపీ తీరు బయటపడింది: కేసీఆర్
వివాదాస్పద రైతు చట్టాలను నిరసిస్తూ ఆత్మత్యాగం చేసిన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఒక్కో రైతు కుటుంబానికి 3 లక్షల సాయం అందిస్తామని ప్రకటించారు. అందు కోసం రూ..22.5 కోట్లు ఖర్చవుతాయని వివరించారు. రైతు నాయకులను సంప్రదించి.. ఆ కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రైతులపై కేసులు పెట్టి వేధించడం సరికాదని కామెంట్ చేశారు. అంతేకాదు బెంగళూరులో ఓ అమ్మాయి రైతులకు సంఘీభావంగా ఓ ట్వీట్ చేస్తే ఆ అమ్మాయిపై కూడా కేసు పెట్టారు. తక్షణమే ఇటువంటి కేసులన్నింటినీ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. రైతులే కాక.. వారికి మద్దతుగా నిలిచేవారిని కూడా వేధించడం సరికాదని హితవు పలికారు. తీరు మార్చుకోవాలని సజెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలోనే ఫ్యూయల్ రేటు తగ్గిస్తున్నారని.. ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని సూచించారు.

కనీస మద్దతు ధర
చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షలు. రైతులపై నమోదయిన కేసులన్నీ ఎత్తేయాలని. కనీస మద్దతు ధర చట్టం తీసుకొని రావాలని మూడు అంశాలు డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దానిపై పోరాటం చేస్తాం అని వివరించారు. ప్రతి రైతు అడుగుతుంది మినిమమ్ సపోర్ట్ ప్రైస్.. మాగ్జిమమ్ సపోర్ట్ ప్రైస్ అడుగుతలేరని వివరించారు. పార్లమెంట్ సమావేశంలోనే ఆచట్టాన్ని పెట్టాలి. మేము కూడా దానిపై పోరాటం చేస్తం.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాకాలంలో పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. త్వరలో అందరికీ రైతు బంధు కూడా అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. ఇదీ పెట్టుబడి సాయం అని.. కంటిన్యూ అవుతుందని కేసీఆర్ స్పష్టంచేశారు.

విద్యుత్ చట్టం కూడా
వ్యవసాయ చట్టంతోపాటు విద్యుత్ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో వ్యవసాయ రంగానికి ఫ్రీగా ఇస్తున్నామని వివరించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతు లోకం చాలా నలిగిపోయి నష్టపోయిందన్నారు. కష్టపడ్డది కాబట్టి వారిని ఆర్థికంగా స్థితిమంతులను చేయడం కోసం, తెలంగాణ రైతాంగాన్ని ఆత్మవిశ్వాసంతో బతికేటట్టు తయారు చేయడం కోసం అనేక చర్యలు చేపట్టామని వివరించారు. 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఆ చట్టంతో అలా చేయడం కుదరదన్నారు. 24 గంటలు కాదు.. ఫ్రీగా కూడా ఇవ్వలేమని పేర్కొన్నారు.

బెదిరించడం సరికాదు
ప్రతి బోరు వద్ద, ప్రతి దాని వద్ద మీటరు పెట్టండని చెబుతున్నారు.. మాకు కెపాసిటీ ఉంది.. రైతులకు ఉచితంగా సరఫరా చేసుకుంటమని చెబుతున్నామని వివరించారు. ఏ రాష్ట్రాలు ఇట్ల ఇస్తయో ఆ రాష్ట్రాలను అనవసరంగా ఒత్తిడికి గురి చేయొద్దని డిమాండ్ చేశారు. విద్యుత్ చట్టంపై విద్యుత్ కార్మికులు, ప్రజలు ఆందోళనతో ఉన్నారని వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం చాలా ఆందోళనతో ఉందన్నారు. మీటర్లు పెట్టేందుకు సిద్ధంగా లేమన్నారు. పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. తమకు వచ్చే నిధులు నిలిపేస్తమని ఇంకో రకమైన పద్ధతిని అవలంభిస్తున్నారు.. ఇది కరెక్టు కాదన్నారు. ఇది నియంతృత్వ వైఖరి అని తెలిపారు. మీ పాలసీ మంచిదని, ఒక వేళ మీ పార్టీ అధికారంలో ఉన్న చోటఅమలు చేసుకుంటమంటే చేసుకోండి. అందరిపై రుద్దేలా కఠినతరమైన చట్టాన్ని తెచ్చి, మెడమీద కత్తిపెట్టే ప్రయత్నం చేయొద్దని, ఆ విద్యుత్ చట్టాన్ని కూడా వెంటనే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చట్టం పాస్ ఇంకా కాలేదు. పాసైతే చాలా తీవ్రమైన ఆందోళన దేశవ్యాప్తంగా చెలరేగుతుంది. మళ్లీ ఒకసారి రైతులంతా బజారునపడుతారని వివరించారు. తమిళనాడు, ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నారని గుర్తుచేశారు.

మోటార్లు పెడతాం అని
బాయిలకాడ మీటర్లు పెట్టండి. బోర్లకాడ మీటర్లు పెట్టం అనేది దుర్మార్గమైన చర్య.. అది కూడా వ్యవసాయ వ్యతిరేక చర్య అని తెలిపారు. ఆ చట్టాన్ని కూడా వ్యవసాయ చట్టాలతో విద్యుత్ చట్టాన్ని పాస్ చేయకుండా వాపస్ తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ నుంచి చట్టాన్ని వ్యతిరేకిస్తాం. లోక్‌సభలో, రాజ్యసభలో మాకున్న శక్తిమేరకు పోరాడుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ చట్టాలు వస్తే రైతన్నకు మంచి జరగదన్నారు. ఇప్పుడు ఇచ్చే ఉచిత విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. ఇదీ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం అని ఫైరయ్యారు.

ఇదీ వారి తీరు
రాష్ట్ర బీజేపీ నేతల గుట్టు మొత్తం బయటపడిందని కేసీఆర్ అన్నారు. ఇకనైనా బీజేపీ నేతలు తమ చిల్లర పనులు మానుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇకనైనా చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. మీ గుట్టు మొత్తం బయటపడిందని తెలిపారు. మీరేంటో అందరికీ అర్థం అయిందన్నారు. పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే.. మిమ్మల్ని ఎవ్వరూ నమ్మరన్నారు. మీ కథేందో తెలిసిపోయింది జనాలకు. వాళ్లకు పూర్తిగా అర్థం అయిందన్నారు. తప్పుకు పొరపాటు అయింది.. క్షమించమని చెంపలేసుకొని ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలని సూచించారు. అనవసరమైన బేషజాలకు పోకుండా... వాస్తవాలు ప్రజలకు తెలపాలని సూచించారు. రైతులు కూడా బీజేపీ నేతల మాటలు పట్టుకొని ఆగం కావద్దని సూచించారు. రైతులను ఇకనైనా తప్పుదోవ పట్టించొద్దు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications