హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.12 కోట్లు లూటీ.. బ్యాంక్ సర్వరే హ్యాక్.. సైబర్ కేటుగాళ్లు మాములుగా లేరుగా..

|
Google Oneindia TeluguNews

కస్టమర్స్‌ను బ్యాంకులు పదే పదే హెచ్చరిస్తుంటాయి. ఓటీపీ చెప్పొద్దు అని.. డీటెల్స్ ఎవరికీ చెప్పొద్దు అని మొత్తుకుంటాయి. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో కారణం చెప్పి.. అమాయకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. క్షణాల్లో డబ్బులను గుంజేస్తున్నారు. కానీ బ్యాంకునే చీట్ చేస్తే.. అదే బ్యాంకు సర్వర్ హ్యాక్ చేస్తే.. ఆ పరిస్థితి వర్ణణాతీతం. అవును మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేశారు. బ్యాంకులో గల నగదను ట్రాన్స్ ఫర్ చేసి.. సవాల్ విసిరారు. వెంటనే యజమాన్యం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 కోట్లు కొట్టేసిన వైనం..

కోట్లు కొట్టేసిన వైనం..

మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ అటాక్ జరిగింది. సైబర్ క్రిమినల్స్ కోట్ల రూపాయలు కొట్టేశారు. బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేసి మరీ నగదును దోచుకున్నారు. బ్యాంకు అకౌంట్లలో గల రూ.12కోట్లకు పైగా నగదును కాజేశారు. హ్యాక్ చేసిన సర్వర్ నుంచి 120 అకౌంట్లకు నగదు బదిలీ చేశారు. బ్యాంకు మెయిన్ సర్వర్ పై సైబర్ అటాక్ జరిగినట్లు గుర్తించిన బ్యాంకు యాజమాన్యం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. బ్యాంకు సర్వర్‌ని ఎక్కడి నుంచి హ్యాక్ చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు.

 టెక్నికల్ సిబ్బంది స్పందించేలోపు..

టెక్నికల్ సిబ్బంది స్పందించేలోపు..

సైబర్‌ క్రిమినల్స్ దోపిడీ పెరిగిపోతున్నాయి. బ్యాంక్‌ సర్వర్‌ హ్యాక్‌ చేశారు. బ్యాంకు టెక్నికల్ సిబ్బంది స్పందించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మహేష్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు సర్వర్‌ను హ్యాక్‌ చేసి రూ.12 కోట్లు కాజేశారు. బ్యాంకు సర్వర్లకే భద్రత లేకపోతే ఎలా? అనే అంశం ఆందోళనకు గురి చేస్తోంది. ఇదీ ప్రైవేట్ కో ఆపరేటివ్ బ్యాంకు అయినా.. సరయిన భద్రతా ప్రమాణాలను పాటించేది. కానీ సైబర్ నేరగాళ్లు మాత్రం బ్యాంక్ సర్వర్‌ను కూడా సునాయసంగా హ్యాక్ చేశారు. ఇంకేముంది అందులో గల నగదును తమ ఖాతాలను బదిలీ చేసుకున్నారు.

 24 గంటల్లోనే

24 గంటల్లోనే

వాస్తవానికి సైబర్ అటాక్ జరిగితే 24 గంటల్లో స్పందించాలి.. లేదంటే దానిని ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. ముఖ్యంగా నైజిరియా ముఠాలు ఇలా హ్యాక్ చేస్తుంటాయి. అవీ థర్డ్ పార్టీ యాప్ ద్వారా కూడా సైబర్ అటాక్ చేస్తుంటాయి. కానీ ఏకంగా బ్యాంక్ సర్వర్ హ్యాక్ చేయడం చర్చానీయంశం అయ్యింది. ఆ నగదు రికవరీ చేయడం సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్‌గా మారింది.

English summary
mahesh co-operative bank server hacked. rs 12 crores money transfered to cyber attackers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X