రాహుల్ మాటే రేవంత్ చెప్పారు: కాంగ్రెస్ చరిత్ర అదేనంటూ జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల మేలు గురించి ఆలోచించలేదని మంత్రి జగదీశ్ అన్నారు. కాంగ్రెస్ నేతలకు ఇంట్లో 24 గంటల విద్యుత్ ఉండాలి గానీ.. రైతులకు వద్దా? అని ప్రశ్నించారు. రైతులకు 8 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రైతులకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు.
దేశంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత పాలన చేసింది. గతంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు కానీ.. వైయస్సార్ హయాంలో 9 గంటల విద్యుత్ ఇవ్వట్లేదని రైతులు ధర్నా చేశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పుడు రైతులకు బీఆర్ఎస్ సర్కారు 24 గంటల ఉచిత్ విద్యుత్ ఇస్తుంటే.. ఏడుపెందుకు? అంటూ మంత్రి విమర్శించారు.

ప్రజలకు ఏదీ ఉచితంగా ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు జగదీశ్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సాగుకు 3 గంటల విద్యుత్ చాలని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల దుర్మార్గపు ఆలోచనలు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రైతులకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేస్తారని జగదీశ్ రెడ్డి తెలిపారు.
రైతులకు ఉచిత విద్యుత్ మూడు గంటల చాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలనే రేవంత్ చెప్పారన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలున్నాయన్నారు. అధికారంలోకి వస్తే యాదాద్రి పవర్ ప్లాంట్ ను రద్దు చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారో తెలియదు కానీ.. తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ టచ్‌లో ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. కాగా, అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. రైతులకు ఉచిత విద్యుత్ 24 గంటల అవసరం లేదని.. 8 గంటలు ఇస్తే చాలని చెప్పారు.
-
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆర్టీవో ఆఫీసులకు తిరిగే పని లేకుండా తెలంగాణా వాహనదారులకు సీఎం రేవంత్ శుభవార్త! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications