హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Congress Mukth Bharat:ఖాయం, 2 రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారం: విజయశాంతి

|
Google Oneindia TeluguNews

పంజాబ్ మినహా మిగతా చోట్ల బీజేపీ విక్టరీ కొట్టింది. దీంతో కమల దళం సంబరాలు చేసుకుంటుంది. దీంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అవుతున్నారు. 'కమలం వికసించింది... కాషాయం రెపరెపలాడింది' అని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ విజయఢంకా మోగించిన సంగతితెలిసిందే.

 ప్రభావం లేదే..

ప్రభావం లేదే..

విపక్షాలు బూచిగా చూపిన వ్యవసాయ చట్టాల ప్రభావం ఏమీ లేదని తేలిపోయిందని విజయశాంతి అన్నారు. బీజేపీపై ఎన్ని కట్టుకథలు అల్లినా నిజమేంటో ఓటర్లు గ్రహించారని చెప్పారు. జాతి సమగ్రత, సమైక్యత లక్ష్యంగా కొనసాగుతున్న బీజేపీ పాలనకు గొప్ప ఉదాహరణగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోవాలని కోరారు. 37 ఏళ్ల తర్వాత రెండోసారి వరుసగా యోగి సర్కారు అధికారాన్ని దక్కించుకుందని రాములమ్మ తెలిపారు.

 అక్కడ కూడా విజయం..

అక్కడ కూడా విజయం..


బీజేపీని మతతత్వ పార్టీగా ముద్రవేసిన విపక్షాలకు యూపీలో బీజేపీ గెలుపు పెద్ద చెంపపెట్టు అన్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్న స్థానాల్లో కూడా బీజేపీ విజయం సాధించిందని, హిందువులు తరతరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణంతో పాటు.... కాశీలో జ్ఞానవాపి మసీదుకు కూడా రక్షణ కల్పిస్తూ కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మించారని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలకు రక్షణనిచ్చింది బీజేపీ పార్టీ అని ఆమె తెలిపారు.

మీరే చెప్పండి..

మీరే చెప్పండి..


ఇది మత సామరస్యమో... లేక మతతత్వమో విపక్షాలే చెప్పాలని కోరారు. సమాజ్‌వాదీ హయాంలో పెంచి పోషించిన మాఫియా ముఠాలు, రౌడీయిజం నుంచి స్త్రీలకు రక్షణ కల్పించారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ విధానాలు అమలవుతున్నాయి. రెండేళ్ళ నుంచీ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సీన్ ఇవ్వడంతో పాటు, ప్రస్తుత ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో అక్కడి నుంచి భారతీయులందరినీ ఒక్క పైసా కూడా వసూలు చెయ్యకుండా స్వదేశానికి తరలిస్తోన్న విషయాన్ని ప్రస్తావించారు.

 సమీక్షిస్తాం..

సమీక్షిస్తాం..


పంజాబ్‌లో మాత్రమే బీజేపీ వెనుకబడింది. అక్కడి పరిస్థితిపై పార్టీ తప్పక సమీక్ష చేసుకుని చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో అక్కడా పాగా వెయ్యడం ఖాయం. ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. త్వరలో కాంగ్రెస్ ముక్త భారత్ సాకారం కావడం ఖాయం అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నడుం బిగించారు. ఈ ఎన్నికల ఫలితాలతోనైనా ఆయనకు కనువిప్పు కలుగుతుందనుకోవడం అత్యాశే అయినా... ఆయనకు బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని విజయశాంతి అన్నారు.

English summary
Congress Mukt Bharat is soon possible in india. bjp leader vijayashanti said. 2 states only congress party power
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X