కంగారు పెడుతున్న కరోనా.. హైదరాబాద్‌లో సెంచరీకి చేరువగా.. రాష్ట్రంలో ఎన్నంటే..
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఐఐటీ ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు హెచ్చరించినట్టు జూన్‌లో ఫోర్త్ వేవ్ బెంబేలెత్తించే ఛాన్స్ ఉంది. గత నాలుగైదు రోజుల నుంచి దేశవ్యాప్తంగా.. తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. అందరూ విధిగా మాస్క్ ధరించాలని వైద్యశాఖ కోరుతుంది.
రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి కేసులు ఎక్కువనే వస్తున్నాయి. వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గురువారం 12, 385 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 122 కేసులు వచ్చాయి. కరోనా సోకి 42 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 811 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

కేసుల్లో సింహాభాగం రాజధాని హైదరాబాద్‌లోనే వస్తున్నాయి. ఇప్పటికే దాదాపుగా అన్నీ ఆఫీసులు తెరచుకున్నాయి. రోడ్లపై జనాలు ఎప్పటిలా ఉన్నారు. కేసులు పెరగడానికి ఇదీ కూడా ఓ కారణం అయి ఉంటుంది. మేడ్చల్ మల్కాజిగిరిలో 9, రంగారెడ్డి జిల్లాలో 12, సంగారెడ్డి జిల్లాలో 3 కేసులు వచ్చాయి. పరిస్థితి ఇలానే ఉంటే కేసులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
వైద్యశాఖ అధికారులు సూచించిన విధంగా విధిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇదివరకు వాడినట్టు బయటకు వెళ్లి వస్తే.. శానిటైజ్ చేసుకోవడం మరవొద్దు. పరిశుభ్రంగా ఉంటూ.. వైరస్‌ను సమూలంగా పారద్రోలాల్సిన అవసరం ఎంతయిన ఉంది.












Click it and Unblock the Notifications