Cyber Crime: లోన్ ఇప్పిస్తామని రూ.3 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు..
లోన్ ఇప్పిస్తానని ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాధితుడి వద్ద రూ.3.17 లక్షలు కాజేశారు. బాధితుడిని సైబర్ నేరగాళ్లు ఫోన్ లో సంప్రదించారు. 50 లక్షల రుణం ఇప్పిస్తానని చెప్పారు. తక్కువ వడ్డీతో లోన్ వస్తే నీ బిజినెస్ మరింత పెంచుకోవచ్చని చెప్పారు. అంత బాగా మాట్లాడడంతో అతను వారిని నమ్మాడు. సదరు మోసగాళ్లు బాధితుడి ఆధార్, పాన్ కార్డ్, అలాగే ట్రేడ్ లైసెన్స్ పత్రాలను అడిగారు. ట్రేడ్ లైసెన్స్ పత్రాలు అడిగే సారికి అతను నిజంగానే నమ్మాడు. అడిగిన పత్రాలను వారికి పంపాడు.
ఆ తర్వాత ప్రాసెసింగ్ తో పాటు వివిధ రుసుములు చెల్లించాలని. వాటి మొత్తం రూ.3,17,207 ఉంటాయని పేర్కొన్నారు. దీంతో అతను ఆ మొత్తన్ని చెల్లించాడు. ఆ తర్వాత అవతలి వారు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. దీంతో బాధితుడు తను మోసపోయానని గ్రహించిన పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ చాలా మంది మోస పోతూనే ఉన్నారు. సాధారణంగా బ్యాంకులు, ఎన్ఫీఎఫ్సీల నుంచి లోన్లు తీసుకుంటారా అని ఫోన్ చేస్తారు.

అయితే వారు ఏమైనా పత్రాలు అడిగితే వాటిని పంపకూడదని పోలీసులు చెబుతున్నారు. లోన్ తీసుకునే వారు డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్లి తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే.. హెల్ప్‌లైన్ నంబర్ 1930 సంప్రదించాలని.. లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 8712665171కు వాట్సాప్ చేయవచ్చని పేర్కొన్నారు. రుణం తీసుకునే ముందు ఆ సంస్థ గురించి తెలుసుకోవాలన్నారు. ణదాతలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)చే గుర్తింపు పొందారా లేదే తనిఖీ చేసుకోవాలన్నారు.
యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు లేదా కార్డ్ సమాచారం వంటి సున్నితమైన వివరాలను సోషల్ మీడియాలో ఎవరితోనూ ఎప్పుడూ షేర్ చేయవద్దన్నారు. బ్యాంకులు, RBI లేదా ఆర్థిక సంస్థలు వంటి నిజమైన సంస్థలు ఈ సమాచారాన్ని అభ్యర్థించవని గ్రహించాలని కోరారు.












Click it and Unblock the Notifications