కరోనాను వాడేస్తున్న సైబర్ నేరగాళ్ళు ... తస్మాత్ జాగ్రత్త
మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు . ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో కూడా మోసగాళ్ళు తమ టాలెంట్ చూపిస్తూనే ఉన్నారు. ప్రజలను బకరాలు చేస్తూనే ఉన్నారు. మోసగాళ్లు తమకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రపంచమంతా కరోనా వైరస్ తో భయపడుతున్న తరుణంలో న్యూస్ రూపంలో సైబర్ నేరగాళ్ళు ప్రజలను వాటిని ఓపెన్ చేసేలా చేసి వారి మొబైల్ లోనూ, కంప్యూటర్ లోనూ ఉన్న సమాచారాన్ని దోచుకుంటున్నారు. అందులో బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఉంటే ఇక బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేస్తారు.

ఫేక్ మెయిల్స్ పంపి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు
ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా వైరస్ భయంతో దానికి సంబంధిచిన ఏ న్యూస్ వచ్చినా ఆతృతగా చూస్తున్నారు. అయితే ఇదే అవకాశంగా మలుచుకున్నసైబర్ మోసగాళ్లు కరోనా వైరస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ మెయిల్స్ పంపించి మోసం చేస్తున్నారు . దీనిని గుర్తించిన తెలంగాణ పోలీసులు జాగ్రత్తగా ఉండాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక దీనిపై ఓ ప్రకటన విడుదల చేసారు పోలీసులు.

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
మీకు కేంద్ర వ్యాధి నియంత్రణ సంస్థ , ప్రపంచ ఆరోగ్య సంస్థల నుండి అంటూ మెయిల్ పంపిస్తూ దోపిడీ చేస్తున్న సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు పోలీసులు . మీకు కేంద్ర వ్యాధి నియంత్రణ సంస్థ , ప్రపంచ ఆరోగ్య సంస్థల నుండి మెయిల్స్ రావొచ్చు. ఈ మెయిల్ కి "Safety Precautions" పేరుతో ఒక ఫైల్ అటాచ్మెంట్ ఉండవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి మెయిల్ గాని, అటాచ్మెంట్ ఫైల్ గానీ క్లిక్ చేయవద్దు అని హెచ్చరిస్తున్నారు.

బ్యాకు ఖాతాలు గల్లంతు అయ్యే అవకాశం ఉందన్న పోలీసులు
పొరబాటున ఆ అటాచ్మెంట్ పై క్లిక్ చేశారంటే మీ కంప్యూటర్ లో లేదా ఫోన్లో ఉన్న సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయి జాగ్రత్త అని చెబుతున్నారు. ఇక ఈ మెయిల్ ఐడీ [email protected] ఇదే అని చెప్తున్నారు. అలాంటి మెయిల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని తెలంగాణ రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. అప్రమత్తంగా లేకుంటే అసలే కష్ట కాలంలో ఉన్న కొద్దిపాటి డబ్బులు సైబర్ నేరగాళ్ళ ఖాతాకు చేరతాయని చెప్తున్నారు .
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications