Cyber Crimes: కొంప ముంచిన పార్ట్ టైమ్ జాబ్.. రూ.47 లక్షలు మోసపోయిన వ్యక్తి..
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పెరుగుతోన్నారు. రోజుకో రీతిలో మోసాలకు తెగబడుతున్నారు. అయితే ఇక్కడ బాధితుల తప్ప కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. సైబర్ మోసాల ఎంతగా అవగాహన కల్పించిన కొందరు అత్యాశతో డబ్బులు పోగొట్టుకంటున్నారు. అయితే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయేవారు ఎక్కువగా చదువుకున్నవారే ఉండడం గమనార్హం. గతంలో ఓ మహిళా సాఫ్ట్ ఉద్యోగిని జీతం వేలల్లో ఉన్నా.. పార్ట్ టైమ్ జాబ్ కు ఆశపడి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. లక్షల రూపాయలు పోగొట్టుకుంది.
తాజాగా జంట నగరాల్లోనే పలు ప్రాంతాలకు చెందిన వారి సైబర్ నేరగాళ్ల మోసం చేసి ఏకంగా రూ. 2 కోట్లకు పైగా కొల్లగోట్టారు. బొరబండకు చెందిన ఓ వృద్ధురాలి ఎవరో ఫోన్ చేశారు. క్రిప్టే కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా డబ్బులు వస్తాయని చెప్పారు. ఇది నమ్మిన వృద్ధరాలు రూ.63 లక్షలు వివిధ దశల్లో పెట్టుబడి పెట్టింది. చివరికి మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో ఘటన సికింద్రాబాద్ కు చెందిన సూర్యలత అనే మహిళ స్పిన్నింగ్ మిల్ నడుపుతోంది.

తన కంపెనీ మెటీరియల్ కోసం లండన్ చెందిన కంపెనీతో డీల్ మాట్లాడుకున్నారు. రూ.1 కోటి 40 లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ గా రూ.47 లక్షలను ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేశారు. కొద్ది రోజులకు ఆమెకు ఒక మెయిల్ వచ్చింది. మిగతా రూ.93 లక్షలు ఈ ఖాతాలో జమ చేయాలని.. ఓ అకౌంట్ నంబర్ పంపించారు. దీంతో సూర్యలత మిగతా రూ.93 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులకు ఫోన్ చేసి డబ్బు పంపామని చెప్పారు. అయితే తమకు డబ్బులు రాలేదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తాము ఎలాంటి మెయిల్ చేయలేదని పేర్కొంది.
దీంతో సూర్యలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో ఓ వ్యక్తి రూ.47 లక్షలు మోసపోయారు. సికింద్రాబాద్ చెందిన అతను పార్ట్ టైమ్ జాబ్స్ కోసం నెట్ లో వెతికాడు. ఒక రోజు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి పార్ట్ జాబ్ ఉందని చెప్పారు. మీరు యూట్యూబ్, ఫేస్ బుక్ వీడియోలకు లైక్ లు కొడితే చాలన్నారు. దీంతో కొన్ని వీడియోలకు లైక్ కొట్టాడు. దీంతో అతని ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఆ తర్వాత పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని ఎర వేశారు. దీంతో అతను రూ.40 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. తర్వాత సైబర్ నేరగాళ్లు ఫోన్ స్వీచ్ఛాప్ చేసుకున్నారు. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరో ఘటనలో ఓ వ్యక్తి ఐఆర్టీసీలో రైలు టికెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే అతను వారు ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో టికెట్లను రద్దు చేసుకున్నాడు. అతను రీఫండ్ కోసం ఐఆర్టీసీని సంప్రదించాలని.. నెట్ సెర్చ్ చేశాడు. అయితే సైబర్ నేరగాళ్ల నెట్ లో ఫేక్ ఐఆర్టీసీ నంబర్ పెట్టారు. ఈ నంబర్ ఐఆర్టీసీ నంబర్ అనుకున్న బాధితుడు ఫోన్ చేశారు. సైబర్ నేరగాళ్లు అతనికి ఓ లింక్ పంపారు. దీంతో అతను లింక్ ఓపెన్ చేయగా.. బాధితుడి ఖాదాలో ఉన్న రూ.5 లక్షల మయమయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.












Click it and Unblock the Notifications