3 లక్షల డోసులు: రోజు ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్: సీఎం కేసీఆర్
కరోనాకు టీకాయే శ్రీ రామ రక్ష. దీంతో వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఇప్పిస్తున్నాయి. రోజుకు 3 లక్షల కరోనా టీకాలు ఇచ్చేలా స్పెషల్ డ్రైవ్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. ఆయన ఇవాళ వైద్యారోగ్యంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రానికి సరిపడ వ్యాక్సిన్ సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వ్యాక్సినేషన్ చేపడుతామని తెలిపారు. విద్యాసంస్థల్లో కరోనా ప్రభావం అంతగా లేదని కేసీఆర్‌కు అధికారులు వివరించారు.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.
Recommended Video
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications