గుడ్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు..
దళిత బంధు పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పథకం వర్తింపజేస్తామని ప్రకటన చేసింది. దీంతో దళిత సామాజిక వర్గానికి చెంది.. అర్హులైన వారికి మేలు జరగనుంది. ఇప్పటికే వాసాలమర్రి, హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ మంత్రి కొప్పుల ఈశ్వర్, సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పథకం అమలు విధివిధానాలపై చర్చించారు.

100 మంది ఎంపిక
దళితబంధు పథకం కోసం ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేల సలహాతో జాబితా రూపొందిస్తారు. లబ్దిదారులకు బ్యాంకు లింకుతో సంబంధం లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. లబ్దిదారుడు కోరుకున్న యూనిట్ ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు.

రూ.500 కోట్ల నిధులు
దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది. పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్ల నిధులను విడుదల చేసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కోసం నిధులను ఈ మంజూరు చేసింది. దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలుంటాయి. పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతోపాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది.

రక్షణ నిధి
దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్తితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తొవది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని సీఎం అన్నారు. తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం 1200 కోట్లతో అమలవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందన్నారు. అందుకోసం అధనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను పైలట్ నియోజకవర్గమైన హుజూరాబాద్ లో ఖర్చు చేయనున్నట్టు సీఎం తెలిపారు.

వాసాలమర్రి
యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి దళిత బందు పథకం ప్రారంభించారు. దీనిని సంబంధించి ప్రభుత్వం ఇటీవలే జీవో విడుదల చేసింది. వాసాలమర్రిలో అర్హులైన 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్ల నిధులను విడుదల చేశారు. వాసాలమర్రి పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వారి అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. దీంతో ఆ నిధులను విడుదల చేశారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమఅయ్యింది. ఇప్పుడు దానిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టంచేసింది.












Click it and Unblock the Notifications