హైదరాబాద్‌ను దోపిడీలతో వణికిస్తున్న ధార్ గ్యాంగ్... ఈ గ్యాంగ్ అసలేం చేస్తుందంటే!!
హైదరాబాద్ నగరంలో మళ్లీ ధార్ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. దోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధార్ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది. దీంతో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్న ఈ గ్యాంగ్ ఇప్పటికే తన స్టైల్ లో దోపిడీలకు పాల్పడుతోంది.
ధార్ గ్యాంగ్ .. దోపిడీలో వీళ్ళదో స్టయిల్
దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో దోపిడీ కేసులు ఉన్న ఈ ధార్ గ్యాంగ్ చోరీలకు పాల్పడే స్టైలే వేరు. ఎక్కడైనా చోరీ చేయాలని ఫిక్స్ అయితే దానికి రెక్కీ నిర్వహించి, ఒకటే సమయంలో ఐదారు ఇళ్లల్లో చోరీకి పాల్పడి మొత్తం దోచుకుని పోతారు. ఈ ధార్ గ్యాంగ్ సభ్యులు ఒక్కొక్క గ్యాంగ్లో ఐదుగురు అంతకంటే ఎక్కువగా ఉంటారు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి తలుపు తట్టి మరీ లోనికి వెళ్లి చోరీలకు పాల్పడతారు.

అర్దరాత్రి తలుపు తడితే తియ్యొద్దు .. పోలీసుల హెచ్చరిక
వారు దోపిడీకి పాల్పడే సమయంలో అడ్డొస్తే ఎటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. కాబట్టి నగర శివారులో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అర్ధరాత్రులు ఎవరైనా తలుపు తడితే తీయవద్దని, వచ్చిన వారు ఎవరు అన్నది నిర్ధారించుకున్న తర్వాతనే తలుపులు తీయాలని సూచిస్తున్నారు. అంతేకాదు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకూడదని కూడా హెచ్చరిస్తున్నారు.
ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో ఐదు ఇళ్ళలో చోరీ
ఇప్పటికే ఈ గ్యాంగ్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో చోరీ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రజయ్ గుల్మోహర్ లో ప్రహరీ గోడ పై ఉన్న సోలార్ వైర్లను కట్ చేసి లోపలికి చొరబడిన ధార్ గ్యాంగ్ ఏకంగా ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇళ్ళలోని నగదు, బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్టు వెల్లడించారు.
The notorious Dhar Gang, responsible for a string of burglaries is on prowl in the outskirts of Hyderabad.
— Sudhakar Udumula (@sudhakarudumula) June 14, 2024
The gang, known for their lightning-fast raids and violent tactics, had terrorized the neighborhoods of Hayat Nagar, Vanasthalipuram, RC Puram, and Ameenpur for weeks.… pic.twitter.com/USRg8zI1sX
ఈ ప్రాంతాల శివారు ప్రజలు అలెర్ట్..
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు దోపిడీ స్టైల్ ని బట్టి ఈ చోరీలకు పాల్పడింది ధార్ గ్యాంగ్ గా నిర్ణయించారు. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలు రాత్రిళ్ళు ఒంటరిగా తిరగకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కనిపిస్తే 100 కి కాల్ చేసి కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications