హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముగ్గురు నిందితులు సాముహిక ఖననం, జక్లేర్‌లో మహ్మద్, ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానానికే...

|
Google Oneindia TeluguNews

దిశపై లైంగికదాడి చేసి హతమార్చిన నిందితుల అంత్యక్రియలు రాత్రి వరకు పూర్తిచేయబోతున్నారు. చటాన్‌పల్లి నుంచి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు నలుగురి మృతదేహాలను తీసుకొచ్చారు. అక్కడ పోస్టుమార్టం పూర్తి చేసి.. మృతుల కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. అక్కడినుంచి నేరుగా వారి గ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలను పూర్తిచేస్తారు.

disha case encounter:దిశనే కాదు, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోనూ నిందితుల ఆగడాలు:సీపీdisha case encounter:దిశనే కాదు, తెలంగాణ, ఏపీ, కర్ణాటకలోనూ నిందితుల ఆగడాలు:సీపీ

Recommended Video

CP Sajjanar Press Meet || ఎన్ కౌంటర్‌పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడి || Oneindia Telugu
సామూహిక ఖననం

సామూహిక ఖననం

నారాయణ పేట్ జిల్లా గుడిగండ్ల శ్మశానంలో చెన్నకేశవులు, శివ, నవీన్‌ మృతదేహాలకు సామూహికంగా ఖననానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. జక్లేర్‌లో దిశ హత్య కేసులో ఏ1 నిందితుడు మహ్మద్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాలమూరు ఆస్పత్రి నుంచి నేరుగా గ్రామాలకు మృతదేహాలను తీసుకొస్తారు. వారి ఇళ్లకు తీసుకుపోనియకుండా.. శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేస్తారు.

నేరుగా శ్మశానానికే

నేరుగా శ్మశానానికే

దీనికి సంబంధించి వనపర్తి ఎస్పీ అపూర్వరరావు ఇప్పటికే మృతుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. సర్పంచ్, పెద్ద మనుషులతో మాట్లాడి వారిని ఒప్పించారు. మృతుల కుటుంబసభ్యులు తమ ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకుంటామని చెప్పినా.. అందుకు ఎస్పీ అంగీకరించలేదు. పాలమూరు ఆస్పత్రి నుంచి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహాం నుంచి నేరుగా శ్మశాన వాటిక వరకు తీసుకెళ్తారు. అక్కడే సాముహికంగా శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు ఖననం చేస్తారు.

పొలంలో కాదు..శ్మశానంలో

పొలంలో కాదు..శ్మశానంలో

మృతులకు తమ పొలంలో అంత్యక్రియలు నిర్వహించుకుంటామని కుటుంబసభ్యులు చెప్పినా.. పోలీసులు అంగీకరించలేదు. శ్మశానంలోనే నలుగురి నిందితుల అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీగా పోలీసులను మొహరించారు. నిందితుల ఎన్‌కౌంటర్‌ను కుటుంబసభ్యులు తప్ప.. మిగతా వారంతా హర్షించారు. పోలీసులు చేసింది సరైన చర్యేనని పేర్కొన్నారు. తమకు కూడా ఆడపిల్లలు ఉన్నారని చెప్తున్నారు.

అప్పటినుంచి పరిచయం

అప్పటినుంచి పరిచయం

మహ్మద్‌కు శివ, నవీన్, చెన్నకేశవులు ఇదివరకే పరిచయం అని స్థానికులు చెప్తున్నారు. లారీ డ్రైవర్ కన్నా ముందు మహ్మద్.. స్థానికంగా ఉన్న బంక్‌లో పనిచేసేవాడు. ఆ సమయంలో శివ, నవీన్, చెన్నకేశవులు కూడా చేరారు. అప్పటినుంచి వారి మధ్య పరిచయం ఏర్పడింది. మహ్మద్ లారీ డ్రైవర్‌గా మారాగా శివను క్లీనర్‌గా పెట్టుకున్నాడు. మిగతా ఇద్దరు లోడింగ్, ఆన్ లోడింగ్ కోసం సాయం తీసుకుంటారు. అలా నలుగురు కలిసే పనిచేస్తున్నారు. లారీలో ఇనుప సామానులు తరలించేవారు. దొంగిలించిన వస్తువును వేరే చోట పెట్టి.. విక్రయించేవారని స్థానికులు చెప్తున్నారు.

English summary
disha accused deadbodies are send to Cemetery not to their home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X