వికారాబాద్ మున్సిపల్ సమావేశం రసాభాస.. చైర్ పర్సన్‌పై గులాబీ కౌన్సిలర్ల గుర్రు
వికారాబాద్ మున్సిపల్ ప్రత్యేక సమావేశం రసాభాసాగా మారింది. చైర్‌పర్సన్ మంజులపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు.అగ్రిమెంట్ ప్రకారం పదవి నుంచి దిగిపోవాలని పట్టుపట్టారు. దీంతో చైర్‌పర్సన్, టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.
మధ్యలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కలుగజేసుకున్నారు. మీకు ఏదైనా ఉంటే బయట చూసుకొండి..ప్రజా సమస్యలపై చర్చ జరపాలని పట్టు బట్టారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో సమావేశం గందరగోళం నెలకొంది. ఇరు వర్గాల అరుపులతో సమావేశ ప్రాంగణం మిన్నంటింది. అరుపులు, కేకలతో.. సమావేశం సజావుగా సాగలేదు.

ఒప్పందం ప్రకారం చైర్ పర్సన్ మంజుల పదవీ నుంచి దిగిపోవాలి. కానీ అలా జరగడం లేదు. దీంతో సభలోనే వారు నిరసనలు చేయాల్సి వచ్చింది. మరొకరికి అవకాశం ఇవ్వాలని సొంత పార్టీ కౌన్సిలర్లు.. మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో గొడవకు దిగారు. ఇదీ స్థానిక రాజకీయాల్లో కలకలం రేపింది. అధికార పార్టీపై విమర్శలు వస్తున్నాయి. సొంత పార్టీలో వచ్చిన అసమ్మతిని చల్లార్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికే కాంగ్రెస్ కౌన్సిలర్లు విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ వారికి అధికార యావ ఎక్కువేనని అంటున్నారు. అందుకోసమే ఇలా గొడవకు దిగారని చెబుతున్నారు. వారికి జనం, వారి సమస్యలు పట్టవని అంటున్నారు.












Click it and Unblock the Notifications