Hyderabad DKZ: 30 వేల మందిని మోసం చేసి రూ.700 కోట్లు కొల్లగొట్టిన డీకేజడ్ కంపెనీ..

చాలా మంది అత్యాశతో మోసపోతారు. తాజాగా ఇలానే ఓ సంస్థ అధిక వడ్డీ ఇస్తామని మోసం చేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
డీకేజీ (DKZ) టెక్నాలజీస్ అనే కంపెనీ ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన 30,000 మందికి పైగా పెట్టుబడిదారులు రూ.700 కోట్లు నష్టపోయారు. ఈ నెలలో మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయాన్ని మూసివేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

కంపెనీ తమ పెట్టుబడిపై 8, 12 శాతం మధ్య వడ్డీ ఇస్తామని వాగ్దానం చేసిందని బాధితులు చెప్పారు. దీంతో చాలా మంది బాధితులు కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. కంపెనీ మొదటగా వడ్డీని సరిగానే చెల్లింది. దీంతో చాలా మంది పెట్టుబడులు పెట్టారు. జూన్ 2024లో పెట్టుబడిదారులకు చెల్లింపులు చేయడం మానేసింది. దీంతో బాధితులు కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. కొంతమంది వ్యక్తులు 2018 నుంచి డబ్బును పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు.

DKZ company cheated 30 thousand people in hyderabad

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కంపెనీపై IPC 403, 406, 420 r/w 120-B సెక్షన్ల కింద (200/2024) కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసు ఫైల్‌ను హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇ జహంగీర్ యాదవ్‌కు అప్పగించారు. ఈ మోసంలో అనేక మంది ఉద్యోగులు, ఏజెంట్లు ప్రజలతో మమేకమయ్యారని బాధితులు పేర్కొన్నారు.

ఏజెంట్లను నమ్మి తాము కష్టపడి సంపాదించిన డబ్బును, జీవితకాల పొదుపును పెట్టామని పెట్టుబడిదారులు తెలిపారు. యూట్యూబర్‌లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కంపెనీ పనితీరుపై తమకు నమ్మకం కలిగించారని వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని, తమ సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+