హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.3 లక్షల కోట్ల అప్పు .. కాదు రూ.2 లక్షల కోట్లు .. తెలంగాణ బడ్జెట్‌‌పై సభలో ఆసక్తికర చర్చ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. వివిధ పథకాల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పుచేసిందని మల్లు భట్టి విక్రమార్క అనడంతో .. సీఎం కేసీఆర్ భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పులు చేయడం సహాజమేనని .. అభివృద్ధి పనులు ఎలా చేయాలి అని ప్రశ్నించారు. రాష్ట్ర అప్పులపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో చర్చ కూడా జరిగింది.

అప్పులకుప్ప ..

అప్పులకుప్ప ..

రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజులకే ధనిక రాజ్యం కాస్త అప్పుల కుప్పగా మారుతుంందని భట్టి విక్రమార్క ఫైరయ్యారు. లక్షల బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అందులో 34 శాతం ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పు చేశారని .. అది ఎలా తీరుస్తున్నారని ప్రశ్నించారు. అద్దు అదుపు లేకుండా రుణం తీసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. 2016 నుంచి తీసుకుంటున్న అప్పు కుప్పలుగా పేరుకుపోయిందన్నారు. అప్పు 2 లక్షల 30 వేల కోట్లు, గ్యారంటీ 73 వేల కోట్ల ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పు చేస్తే రాష్ట్రానికి భారం కాదా అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు. ప్రాజెక్టులు లేవని భట్టి విమర్శించారు.

3 లక్షల కోట్లు

3 లక్షల కోట్లు

రాష్ట్ర అప్పలు రూ.3 లక్షల కోట్ల అని ప్రశ్నించారు కేసీఆర్. అంత మొత్తంలో అప్పు ఉందని రుజువు చేస్తారా అని సవాల్ విసిరారు. విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలే కానీ .. అలా మాట్లాడకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఉంది 2 లక్షల కోట్ల అప్పులేనని స్పష్టంచేశారు. 73 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ అని పేర్కొన్నారు. తెలియకుండా ఎలా మాట్లాడారని మండిపడ్డారు. ఎఫ్ఆర్‌బీఎం పరిధి మేరకు అప్పులు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు.

73 వేల కోట్లు సంగతేంటీ

73 వేల కోట్లు సంగతేంటీ

73 వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ దేనిని చూపించి ఇచ్చారని భట్టి ప్రశ్నించారు. మన కార్పొరేషన్ చూపి అప్పు తీసుకున్నారు కదా అని అడిగారు. అంటే అప్పు కట్టాల్సింది ప్రభుత్వమే కదా అని గుర్తుచేశారు. ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులపై కూడా హాట్ హాట్ చర్చ జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని భట్టి ప్రశ్నించారు. వాస్తవానికి ఐదేళ్లలోనే 36 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందింవ్వాలని .. కానీ సాగునీరు అందించలేకపోయారని విమర్శించారు భట్టి.

English summary
During the Telangana Budget, there was an interesting debate. Mallu Bhatti Vikramarka says that the state government has already lent a huge amount for various schemes .. CM KCR fire. It is natural to borrow for the benefit of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X